వైరల్ న్యూస్

Viral Video: లిఫ్ట్‌లో దారుణ ఘటన.. చిన్నారిపై విరుచుకుపడిన కుక్క!..

రచన: Venu4 నిమిషాల పఠనం

మహారాష్ట్రలోని ముంబైలో ఓ పెంపుడు కుక్క లిఫ్ట్‌లో బాలికపై దాడికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

మహారాష్ట్రలోని ముంబైలో ఓ పెంపుడు కుక్క లిఫ్ట్‌లో బాలికపై దాడికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. కుక్క నోటికి బాస్కెట్ మజిల్ ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ముంబైలోని మలద్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న షేత్ ఐరీన్ టవర్ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు బాలికలు లిఫ్ట్‌లో ఎక్కిన కొద్దిసేపటి తర్వాత ఓ మహిళ తన పెంపుడు కుక్కతో అదే లిఫ్ట్‌లోకి ప్రవేశించింది. అయితే లిఫ్ట్‌లో ఉన్న బాలికలను చూసిన వెంటనే కుక్క వింతగా ప్రవర్తిస్తూ ఒక్కసారిగా ఓ బాలికపై దాడి చేయడానికి ప్రయత్నించింది.

కుక్క ప్రవర్తనను గమనించిన ఇద్దరు బాలికలు వెంటనే లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే మరో బాలిక మాత్రం బయటకు రావడానికి అవకాశం లేక లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయింది. దీంతో కుక్క ఆమెపై పలుమార్లు దూకేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.. దీంతో ఆ బాలిక భయంతో లిఫ్ట్ మూలకు వెళ్లి నిలబడింది. అయితే కుక్క నోటికి ముందుగానే బాస్కెట్ మజిల్ అమర్చడం వల్ల అది బాలికను కరవలేకపోయింది.

కాగా లిఫ్ట్ మరో అంతస్తులో ఆగి తలుపులు తెరుచుకోగానే బాలిక వెంటనే బయటకు పరుగెత్తింది. అయినా ఆ కుక్క బాలికను వెంబడించేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క యజమాని మెడకు కట్టిన తాడును గట్టిగా పట్టుకుని అదుపులో ఉంచడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొత్తం లిఫ్ట్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

కుక్క నోటికి మజిల్ కట్టడం వల్లే బాలిక సురక్షితంగా బయటపడిందని కొందరు యజమానిని ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఇలాంటి దూకుడు స్వభావం ఉన్న కుక్కలను అపార్ట్‌మెంట్లు, లిఫ్ట్‌లు వంటి సామూహిక ప్రదేశాల్లోకి తీసుకురాకపోవడం మంచిదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఘటన పెంపుడు జంతువుల యజమానుల బాధ్యతపై మరోసారి చర్చకు దారితీసింది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పెంపుడు కుక్కలను నియంత్రించేందుకు తగిన భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ లింక్ ఓపెన్ చేసి వీడియో చూడవచ్చు.. https://twitter.com/i/status/2078156809999937755

#Mumbai#lift#dog attack#incident#young child
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి