Spirituality

Spirituality: ఫ్యూచర్ వరల్డ్.. మనిషికి వరమా? శాపమా?

రచన: Venu4 నిమిషాల పఠనం

పాశ్చాత్య దేశాల సంస్కృతులను క్రమక్రమంగా ఒంటపట్టించుకుంటున్న మన భారతీయులు, వారి జీవన విధానంలో పూర్తిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లుతున్నారు.. ఈ తరానికే ఇన్ని ఆర్బాటాలు, హంగులు ఉంటే ముందు తరాల భవిష్యత్తు ప్రమాదం అంచున జీవితాన్ని కొనసాగిస్తున్నట్లే.

పాశ్చాత్య దేశాల సంస్కృతులను క్రమక్రమంగా ఒంటపట్టించుకుంటున్న మన భారతీయులు, వారి జీవన విధానంలో పూర్తిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లుతున్నారు.. ఒక రకంగా అన్నివిధాల విలాసవంతమైన జీవనానికి అలవాటుపడుతున్నారు.. ఇప్పుడంతా రెడిమెడ్ ఫుడ్ క్షణాల్లో ఆర్డర్ చేయగానే ఇంటి ముందుకు వచ్చి అందించే అటువంటి సౌకర్యాలు కలిగాయి.

ఇదే కాకుండా పొద్దున లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు మనిషికి తగినంత శారీక శ్రమ ఉండటం లేదు. ఇప్పుడు ఉన్న జీవిన విధానాన్ని పరిశీలిస్తే డబ్బులకు కొదువ లేదు.. అనుభవించే సుఖాలకు తక్కువలేదు.. ఎప్పుడైతే మనిషి యంత్రంలా మారాడో అప్పుడే అతని ఆరోగ్యంలో మార్పులు సంభవించడం మొదలయ్యింది. వేళకు తినడం, పడుకోవడం అన్ని మరచిపోయి, అశాశ్వతమైన సుఖాల వెంట పరుగులు తీస్తున్నాడు.

ఈ తరానికే ఇన్ని ఆర్బాటాలు, హంగులు ఉంటే ముందు తరాల భవిష్యత్తు ప్రమాదం అంచున జీవితాన్ని కొనసాగిస్తున్నట్లే. ఇప్పటికే భూగర్భ వనరులు అంతరించిపోతున్నాయి, ఈ భూమి మీద బ్రతకడానికి చోటు కరువవుతున్న వేళ, మనిషి మరో గ్రహం కోసం అన్వేషిస్తున్నాడు.. ఇందుకు గాను ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు కూడా.. ఒక వ్యాధికి మందు సృష్టిస్తే, మరో కొత్త రోగం పుడుతుంది..

ఇలా మనిషి తన జీవన విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నా, వాటితోపాటే ఉపద్రవాలు, ప్రమాదాలు పోంచి ఉంటున్నాయి.. అంటే భవిష్యత్తులో ప్రకృతిలో కలిగే మార్పుల వల్ల మానవుని జీవితం అస్తవ్యస్దంగా మారే పరిస్దితులు కనిపిస్తున్నాయి. మనిషికి ఇప్పుడు అందుతున్న స్వచ్చమైన గాలి, బ్రతకడానికి కావలసిన ఆహారపదార్ధాలు అన్ని సరిపడా అందుబాటులో ఉండవు..

ఆక్సిజన్ కొనుక్కుని మాస్క్ పెట్టుకుని బ్రతకవలసిన రోజులు వస్తాయని తెలుస్తుంది.. అలాంటి ఉపద్రవాలను నివారించాలంటే, ఇకనైన మేల్కోని మానవుడు తన జీవన విధానాన్ని మార్చుకుంటే ఉత్తమం. ఇందుకు గాను తన ఆలోచన శక్తిని పాజిటీవ్ ఎనర్జీతో రిచార్జ్ చేసుకుంటూ వీటితో పాటుగా ధ్యానం, యోగా, శాకాహరం, సాత్విక జీవన విధానాన్ని ఆచరిస్తూ, ప్రకృతిని రక్షిస్తూ, తనను తానే నియంత్రించుకుంటూ తన మనుగడను తానే కాపాడుకోవాలి.

లేదంటే భవిష్యత్తు తరాలకు డబ్బును, సౌకర్యాలను ఇచ్చిన వారం అవుతామే గాని, వారి సుఖ జీవనానికి మాత్రం మన ఆలోచనలు ఏ రకంగా సహకరించవు. ఎందుకంటే అప్పటికే జరగవలసిన అనర్ధాలన్ని జరిగి ఉంటాయని మేధావులు చెబుతున్నారు.. అందుకే ఫ్యూచర్ వరల్డ్.. మనిషికి శాపమని అంటున్నారు..

#Spirituality#future world#boon#curse#humanity
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి