Spirituality

Spirituality: దేవుని ఉంగరాన్ని ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి ?

రచన: Venu4 నిమిషాల పఠనం

చాలామంది చేతి వేళ్ళకు పెట్టుకునే ఉంగరాల్లో, మేడలో వేసుకునే చైన్‌లలో తమ భక్తి కొద్ది ఇష్టదైవం ప్రతిమను ఉపయోగిస్తుంటారు. ఇలా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగారాలు, గొలుసులు ధరించగానే సరిపోదు, వాటిని వాడటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయంటున్నారు..

భగవంతుడంటే భక్తి ఉన్న వారి నమ్మకం ఎలా ఉంటుందంటే మణికట్టుకు దారాలు, చేతికి ఉంగరం, మెడలో లాకెట్స్ ధరించి తమ భక్తిని చాటుకుంటారు... ఇందులో ముఖ్యంగా దేవుని ఉంగరాలు పెట్టుకున్న వారు ఎలా పడితే అలా ఉండకూడదంటున్నాయి శాస్త్రాలు. అయితే ఈ ఉంగరాలు పెట్టుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితుల పేర్కొంటున్నారు.

మనలో చాలామంది చేతి వేళ్ళకు పెట్టుకునే ఉంగరాల్లో, మేడలో వేసుకునే చైన్‌లలో తమ భక్తి కొద్ది ఇష్టదైవం ప్రతిమను ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవటం లాంటివి చేస్తుంటారు. ఇలా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగారాలు, గొలుసులు ధరించగానే సరిపోదు, వాటిని వాడటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయంటున్నారు..

ఉంగరాలలో కాని, గొలుసులలో కాని, దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేయించి జాతకరీత్యా ధరించాల్సి ఉంటుంది. అలా పూజ చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుందట. అయితే ఉంగరం ధరించిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే.. ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ తల మన మణికట్టు వైపు, దేవుని కాళ్ళు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలని పండితులు చెబుతున్నారు.

అలాగే మన శరీరం చేతివేళ్ళు, గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి. కాబట్టి ఉంగరాలని కళ్ళకు అద్దుకునేటప్పుడు పిడికిలి గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలట. ఇక మహిళలు అయితే, బహిష్టు సమయం కంటే ముందే ఉంగరాలను, లాకెట్లను తీసి భద్ర పరుచుకోవాలి. బహిష్టు సమయంలో దేవుడి ప్రతిమలు ఉన్న వాటిని ధరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

అంతేకాదు, భోజనం చేసేటప్పుడు ఉంగారానికి ఎంగిలి అంటకూడదు. ఉంగరం ధరించి మాంసాహారం భుజించకూడదు. ఇక ధూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగులకూడదు. అలాగే మద్యపానం కూడా చేయకూడదట. మొత్తానికి ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాన్ని ధరించాలని.. లేకపోతే మనకు మంచి కంటే చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంటుందని పండితులు అంటున్నారు.

#Spirituality#india#God#ring#rules must#dedicated
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి