క్రీడలు

Garry Sobers: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత..

రచన: NK3 నిమిషాల పఠనం

వెస్టిండీస్ క్రికెట్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన వారిలో ఒకరు సోబర్స్. 1968లో గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడుతూ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో వరుస బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచారు.

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ గ్యారీ సోబర్స్ (సర్ గ్యార్ ఫీల్డ్ సోబర్స్) కన్నుమూశారు. ఆయన వయసు 89ఏళ్లు. ఆయన తనయుడు డానియల్ గ్యారీ సోబర్స్ మరణాన్ని ధృవీకరించారు. బార్బడోస్ లోని తన నివాసంలో గ్యారీ సోబర్స్ తుది శ్వాస విడిచారు. 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ వరకు క్రికెట్ ఆడారు. 93 టెస్టుల్లో 8వేల 32 పరుగులు చేశారు. ఇందులో 26 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 235 వికెట్లు కూడా తీశారు. క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందారు. ఇక, 1968లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు బాది ఆ రికార్డ్ నమోదు చేసిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించారు గ్యారీ సోబర్స్. సోబర్స్ తన 90వ పుట్టిన రోజును పూర్తి చేయడానికి కేవలం 10 రోజుల దూరంలో ఉన్నారు.

వెస్టిండీస్ క్రికెట్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన వారిలో ఒకరు సోబర్స్. 1968లో గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడుతూ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో వరుస బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచారు. 2004 నుండి ఐసీసీ (ICC) ఏటా 'మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ గ్రహీతకు 'సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ'ని ప్రదానం చేస్తోంది.

ఎడమచేతి వాటం బ్యాటర్, ఎడమచేతి ఫాస్ట్-మీడియం పేస్ బౌలర్ అయిన సోబర్స్ టెస్ట్ క్రికెట్‌లో 235 వికెట్లు సాధించారు. ఆయన కేవలం ఒకే ఒక్క వన్డే (ODI) మ్యాచ్‌లో ఆడి ఒక వికెట్ తీశారు.

#Legend#West Indies#Cricketer#Garry Sobers#Garry Sobers Passes Away#Cricket
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి