సినిమా

Jani Master: జానీ మాస్టర్‌కు షాకిచ్చిన ఫిల్మ్ ఫెడరేషన్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

స్టార్ కొరియోగ్రాఫర్లు అయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ల మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌గా మారిపోయింది.

టాలీవుడ్ పరిశ్రమలో ఇద్దరు డ్యాన్స్ మాస్టర్ల మధ్య నెలకొన్న వివాదం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అలాగే డ్యాన్సర్ల అసోసియేషన్ లో ఉన్న లోపాలు కూడా బయటపడ్డాయి. స్టార్ కొరియోగ్రాఫర్లు అయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ల మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌గా మారిపోయింది.

మరోవైపు డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 17 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీ పై రెమ్యునరేషన్ స్కామ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగా అసోసియేషన్‌ అధ్యక్షురాలు సుమలత.. జనరల్ సెక్రటరీ, ట్రెజరర్‌ను సస్పెండ్ చేశారు. కాగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో 8 మంది ఈసీ సభ్యులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

దీంతో అసోసియేషన్‌లో ఒక్కసారిగా 10 మంది సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలో డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న 10 పదవులకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను శేఖర్ మాస్టర్ వర్గం తిరస్కరిస్తోంది.

ప్రస్తుతం ఉన్న కమిటీని పూర్తిగా రద్దు చేసి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని వారు పట్టుబడుతున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు మరింత ముదురుతూ, ఎన్నికల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ వివాదం పెద్దది అవడంతో ఫిలిం ఫెడరేషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. దీంతో సుమలత, జానీ మాస్టర్ ఫెడరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలను ఫిలిం ఫెడరేషన్ సీరియస్ గా తీసుకొని విచారణకు పిలిచారు.

కానీ జానీ మాస్టర్ వెళ్లకపోవడంతో ఫిల్మ్ ఫెడరేషన్ నేడు షోకాజ్ నోటీస్ లు జారీ చేసింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ నెల 14న విచారణకు పిలిచినా హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 7 రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా జానీ మాస్టర్ కు ఫెడరేషన్ తరపున సహాయ నిరాకరణ చేస్తామని, బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించింది..

#telangana#hyderabad#Tollywood#Dispute#Film Federation#Jani Master
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి