సినిమా

Top Ott Movies 2026: ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్‌ ఓటీటీ సినిమాలు ఇవే!..

రచన: Venu4 నిమిషాల పఠనం

సినిమాలు ఎన్ని వచ్చిన టాప్ లో నిలిచేవి కొన్ని మాత్రమే.. అలాంటి చిత్రాలను అర్మాక్స్‌ మీడియా వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి జూన్‌ వరకు సినిమాలు, షోలు, క్రికెట్‌ ఇలా ఓటీటీ కంటెంట్‌ను మొత్తం క్రోడీకరించి అత్యధిక మంది వీక్షించిన వాటి వివరాలను ప్రకటించింది.

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ధురంధర్‌ మూవీ రికార్డు వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ కూడా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించి భారీ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా.. ఈ చిత్రాలు తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికమంది చూసిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా 37 మిలియన్‌ వ్యూస్‌ను ఈ మూవీ సొంతం చేసుకుంది. అలాగే ‘ధురంధర్‌ 2’కూడా 27.8 మిలియన్ల వ్యూస్‌ తో అదరగొట్టింది.

ఈ గణాంకాలను ఓటీటీ కంటెంట్‌, వ్యూవర్‌షిప్‌ను విశ్లేషించే అర్మాక్స్‌ మీడియా వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి జూన్‌ వరకు సినిమాలు, షోలు, క్రికెట్‌ ఇలా ఓటీటీ కంటెంట్‌ను మొత్తం క్రోడీకరించి అత్యధిక మంది వీక్షించిన వాటి వివరాలను ప్రకటించింది. ఈ జాబితాలో 228.4 మిలియన్‌ వ్యూస్‌తో ఐపీఎల్‌-2026 మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌ సీజన్‌-2.. 38.5 మిలియన్‌ వ్యూస్‌తో నిలిచింది. అలాగే ‘ధురంధర్‌: పార్ట్‌ 1’..35.2 మిలియన్‌ వ్యూస్‌తో మూడో స్థానంలో ఉంది.

మరోవైపు ఇండియా vs న్యూజిలాండ్‌ సిరీస్‌ 30.5 మిలియన్‌ వ్యూస్‌.. ‘ధురంధర్‌ 2’ 28.8 మిలియన్‌ వ్యూస్‌.. మేడ్‌ ఇన్‌ ఇండియా: ది టైటాన్‌ స్టోరీ 17.8 మిలియన్‌ వ్యూస్‌.. ఫిఫా వరల్డ్‌కప్‌ 17.6 మిలియన్‌ వ్యూస్‌.. ప్రభాస్‌ నటించిన ‘ది రాజా సాబ్‌’ 17.5 మిలియన్‌ వ్యూస్‌.. హిందీ వెబ్‌సిరీస్‌ చిరైయా 16.3 మిలియన్‌ వ్యూస్‌ తో టాప్‌-10లో నిలిచాయి.

ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే ‘ది రాజా సాబ్‌’ తర్వాత నందూ, ఆవికాగోర్‌ ప్రధాన పాత్రలో నటించిన అగ్లీ స్టోరీ 8.1 మిలియన్‌ వ్యూస్‌.. బాలకృష్ణ నటించిన అఖండ-2, 6.6 మిలియన్‌ వ్యూస్‌ తో టాప్‌లో ఉన్నాయి. అలాగే వెబ్‌సిరీస్ లో 6.3 మిలియన్‌ వ్యూస్‌తో ‘సేవ్‌ ది టైగర్స్‌ 3’టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత 4.3 మిలియన్‌ వ్యూస్‌ తో విక్రమ్ ఆన్‌ డ్యూటీ.. 3.7మిలియన్‌ వ్యూస్‌ తో బ్యాచ్‌మేట్స్‌ నిలిచాయి.

#Top Ott Movies 2026#india#Ranveer Singh#Dhurandhar#Prabhas#The Raja Saab
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి