Ration Card: మీకు రేషన్ కార్డ్ ఉందా? ఇంకా e-KYC చేసుకోలేదా? అయితే మీకో బిగ్ అలర్ట్. e-KYC చేసుకోని రేషన్ కార్డు లబ్దిదారులు వెంటనే ఆ పని చేయాలి. ఉచితంగా e-KYC చేసుకునే గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తుందని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ-కేవైసీ చేసుకోని లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని వెంటనే సంబంధిత డీలర్ ను కలవాలి. లేదా మీ సేవలో కూడా e-KYC చేయించుకోవచ్చని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఈ-కేవైసీ చేసుకోని లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
ప్రస్తుతం రేషన్ కార్డు ద్వారా లబ్దిదారులు సబ్సిడీ సౌకర్యం పొందుతున్నారు. ఇది కొనసాగించాలంటే e-KYC తప్పనిసరి. రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసి, బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా వెరిఫై చేసే ప్రక్రియనే ఈ కేవైసీ అంటారు. నకిలీ కార్డుల ఏరివేతలో భాగంగా పౌర సరఫరాల శాఖ దీన్ని తప్పని సరి చేసింది. డూప్లికేట్ కార్డులు, మరణించిన వారి కార్డులు తొలగించి.. అర్హులైన కుటుంబాలకు మాత్రమే సబ్సిడీలు చేరేలా చూడటం ముఖ్య ఉద్దేశం.
ఈ కేవైసీ చేయకపోతే జరిగేది ఇదే..
రేషన్ కార్డు ఇన్‌యాక్టివ్ అవుతుంది. కార్డు తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది. లేదా రద్దు కావచ్చు. పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసే సరుకులు తీసుకోలేరు.












