Spirituality

Spirituality: రాముడి కంటే రామనామం ఎందుకు గొప్పదో తెలుసా!..

రచన: Venu4 నిమిషాల పఠనం

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. అంతే కాదు ఆంజనేయుడు కూడా ఎన్నో సందర్భాల్లో నిరూపించాడు కూడా.. రామనామానికున్న శక్తి ఏపాటిదో రామాయణంలో జరిగిన ఒక సంఘటన గురించి కంబ రామాయణంలో తెలిపారు.

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. అంతే కాదు ఆంజనేయుడు కూడా ఎన్నో సందర్భాల్లో నిరూపించాడు కూడా.. అలాగే రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అనే విశ్వాసం ప్రతి భక్తునిలో కనిపిస్తుంది.. ఇకపోతే రామనామానికున్న శక్తి ఏపాటిదో రామాయణంలో జరిగిన ఒక సంఘటన గురించి కంబ రామాయణంలో తెలిపారు.

శ్రీరాముడు లంక కు వెళ్ళటానికి రామ సేతువు నిర్మాణం జరుగుతోంది. వానరులు సముద్రంలో రాళ్లు వేస్తున్నారు. అవి తెలుతున్నాయి. ఇదంతా చూస్తూ శ్రీరాముడు కూడా కొన్ని రాళ్లు వేద్దామని సముద్రంలో రాయిని వదిలాడట. విచిత్రంగా ఆ రాయి మునిగి పోయింది. సరే అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయింది. ఇదేంటి! వానరులు వేస్తే తేలుతున్నాయి. నేను వేస్తే మునిగి పోతున్నాయని రామయ్య సందేహపడ్డాడట..

ఇలా ఎందుకు జరుగుతుందని శ్రీరాముడు హనుమను మరి కొందరిని అడిగాడట. స్వామి! మేము వేసే రాళ్ళ మీద మీ రామ రాస్తున్నాం. మీరు రాయలేదు కదా అన్నారట. అదేంటి. నేను స్వయంగా వేస్తున్నాను కదా. నా నామం రాస్తేనే తేలితే నేను వేస్తే మునిగి పోవటం ఏమిటి? ఎందుకలా? అన్నారట స్వామి. అందుకు హనుమ.. స్వామి! మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగి పోక తప్పదు. ఇప్పుడు అదే జరుగుతోంది స్వామి అని సమాధానం చెప్పారట..

మరోవైపు శివుడే రామనామ మహిమ గురించి పార్వతీదేవికి చెబుతూ.. విష్ణు సహస్రనామాన్ని జపించిన ఫలితం ఒక్కసారి "రామ" నామాన్ని స్మరించినా లభిస్తుందని వివరించినట్టు చెబుతారు. అలాగే వాల్మీకి "మరా మరా" అని జపిస్తూ చివరికి "రామ" నామంలో లీనమై మహర్షిగా మారాడని వాల్మీకి మహర్షి కథలో చెబుతారు. ఈ కథ ద్వారా నామస్మరణ శక్తిని వివరించారు.

అందుకే రామ నామాన్ని జపించండి. ధర్మంగా జీవించండి. రామనామం మహాశక్తివంతం అని తులసీదాస్‌, రామదాసు వంటి ఎందరోమహానుభావులు నిరూపించారు. భక్తిలో ముక్తిని ప్రసాధించేది. అడుగడుగున ఆయుధంలా రక్షణ కలిపించేది రమ్యమైన రామనామం ఒక్కటే అని చెబుతున్నారు.

#Spirituality#india#God#Rama name#greater than
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి