National

INDIA: సెమీకండక్టర్ హబ్‌గా భారత్.. మోదీ విజన్‌కు కిషన్‌రెడ్డి ప్రశంసలు!

రచన: Venu4 నిమిషాల పఠనం

సెమీకండక్టర్ రంగంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కిషన్ రెడ్డి వివరించారు. సెమికాన్ 2.0 కార్యక్రమం ద్వారా రానున్న పన్నెండేళ్లలో ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ రంగాల్లో మొత్తం రూ.1,27,500 కోట్ల పెట్టుబడులు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా భారత్ వేగంగా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

సెమికాన్ 2.0 కార్యక్రమం ద్వారా రానున్న పన్నెండేళ్లలో ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ రంగాల్లో మొత్తం రూ.1,27,500 కోట్ల పెట్టుబడులు ఖర్చు చేయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. అలాగే రూ.62,500 కోట్ల వ్యయంతో తీసుకొచ్చిన మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్, అంటే ఎంపీఎంఎస్, దేశ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని చెప్పారు.

సెమీకండక్టర్ రంగంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ.. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి కోసం కేంద్రం మొత్తం రూ.724 కోట్ల ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని ఈ-సిటీ, ఫ్యాబ్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ఫీల్డ్ ఈఎంసీ ప్రాజెక్టుకు రూ.252 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు.

మహేశ్వరం గ్రీన్‌ఫీల్డ్ ఈఎంసీ ప్రాజెక్టు కోసం రూ.139 కోట్లు కేటాయించినట్లు వెల్లడించిన కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్‌కు రూ.75 కోట్ల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ప్రాజెక్టు కోసం రూ.258 కోట్లను రాష్ట్రానికి కేంద్రం అందించిందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సెమికాన్ 2.0 కార్యక్రమం ద్వారా ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు తెలంగాణలోని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు అందాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్లు, ఎలక్ట్రానిక్ కంపోనెంట్ తయారీ కేంద్రాలు మరింతగా ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తంగా సెమికాన్ 2.0, మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు తెలంగాణను దేశ ఎలక్ట్రానిక్స్ తో పాటు సెమీకండక్టర్ రంగంలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దనున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

#India#tel anhana#semiconductor hub#Kishan Reddy#Modi vision
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి