క్రైమ్

CyberCrime : సైబర్ క్రైం పార్ట్ టైం జాబ్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొత్త అవతారం

రచన: Kumar4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడో విదేశాల్లో కూర్చుని కొందరు నేరగాళ్లు దేశంలోని కొన్ని శక్తుల సాయంతో మ్యూల్ ఖాతాలు తెరిచి అమాయకుల నుంచి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడో విదేశాల్లో కూర్చుని కొందరు నేరగాళ్లు దేశంలోని కొన్ని శక్తుల సాయంతో మ్యూల్ ఖాతాలు తెరిచి అమాయకుల నుంచి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. డిజిటల్ అరెస్టు, ఏపీకే ఫైల్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నకిలీ యాడ్స్ ప్రమోట్ చేస్తూ వాటిని క్లిక్ చేసిన వారికి ట్రేడింగ్, పెట్టుబడుల్లో భారీ లాభాలు అని ఆశచూపి వారిని నిలువునా ముంచుతున్నారు. సైబర్ మోసాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో ఉన్నది. ఇక్కడి నుంచే ఫిర్యాదులు ఎక్కువగా రిపోర్టు అవుతున్నట్టు సమాచారం.

ఇదిలాఉండగా,ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ మోసగాడి అవతారం ఎత్తాడు. ఫుల్ టైం జాబ్ చేస్తూ పార్ట్ టైం కింద సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడు. తాజాగా అతని సైబర్ తంత్రాన్ని పోలీసులు చిత్తు చేశారు. ఇన్ స్టాలో నకిలీ లోన్ యాప్ పేరిట ప్రమోషన్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఆ యాడ్‌ను ఎవరైనా క్లిక్ చేస్తే చాలు..వారి వాట్సాప్‌ నెంబర్‌కు మెసేజ్‌లు పెట్టి వారి అవసరాలను క్యాష్ చేసుకుంటున్నాడు.

https://x.com/TeluguScribe/status/2078294953323815269?s=20

ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ తక్కువ వడ్డీకే ఆన్‌లైన్ లోన్ అనే యాడ్‌ను ఆదిలాబాద్ రూరల్ పీఎస్ పరిధిలోని అంకోలి గ్రామానికి చెందిన మెస్రం ప్రవీణ్ అనే వ్యక్తి క్లిక్ చేశాడు. దీంతో వెంటనే ప్రవీణ్‌కు వాట్సాప్ కాల్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్ ఫీజు, ఈఎంఐ, సర్వీస్ చార్జీలు అంటూ ముందే రూ.17,951 నొక్కేసినట్టు తెలిసింది. తర్వాత రుణం మంజూరు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. ప్రవీణ్ లాంటి బాధితులు ఇంకా 30 మంది ఉన్నారని గుర్తించారు. కాగా, నిందితులు హైదరాబాద్ - ముషీరాబాద్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి తలారి ఆకాష్‌తో పాటు మరో నలుగురిని గుర్తించారు. ఆకాష్‌ను అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మిగతా నలుగురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

#cybercrime#hyderabad#software engineer#parttime job
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి