రాజకీయాలు

BRS : ఔటర్ గోల్కొండలో టెన్షన్ టెన్షన్.. ఎమ్మెల్సీ నవీన్ VS పోలీసులు!

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రరాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ రోజుకో కార్యక్రమంతో కదం తొక్కుతోంది.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

రాష్ట్రరాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ రోజుకో కార్యక్రమంతో కదం తొక్కుతోంది.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నించేందుకు యువసంగ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నలుమూలలు, పలు జిల్లాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో సభకు విచ్చేందుకు తరలుతున్నారు.

ఈ క్రమంలోనే పోలీసులు బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మరికొందరిని ఎక్కడపడితే అక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వం అనుమతినివ్వకపోతే హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకున్నామని.. అలాంటప్పుడు పోలీసులు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే సరూర్ నగర్ సభకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు.

https://x.com/TeluguScribe/status/2078374080542306619?s=20

మరికొందరు సభవద్దకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గోల్గొండ ఔటర్ వద్ద పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొన్నది. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు కోసం షాద్ నగర్ నుండి బయలుదేరిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.400 వాహనాలతో సభకు బయలుదేరిన నవీన్ రెడ్డి బృందాన్ని ఔటర్ గోల్కొండ సమీపంలో అడ్డుకోవడంతో పాటు పలువురిని బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలిస్తున్నారు. తమకు హైకోర్టు అనుమతి ఉందని, ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో ట్రాఫిక్ సైతం నిలిపోయింది. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

#BRS#Police#Mlc naveen reddy#convoy#golkonda#hyderabad#KTR#yuvasangrama saba
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి