National

RBI : నకిలీ కరెన్సీకి చెక్.. త్వరలోనే దేశంలో పాలిమర్ నోట్లు!

రచన: Kumar4 నిమిషాల పఠనం

భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో సంచలనానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో పాలిమర్(ప్లాస్టిక్) నోట్లను తీసుకురావాలని యోచిస్తున్నది. ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం కూడా జరగగా.. ముందుగా చిన్న నోట్లను పాలిమర్ కరెన్సీతో భర్తీ చేయనున్నారు.

భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో సంచలనానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో పాలిమర్(ప్లాస్టిక్) నోట్లను తీసుకురావాలని యోచిస్తున్నది. ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం కూడా జరగగా.. ముందుగా చిన్న నోట్లను పాలిమర్ కరెన్సీతో భర్తీ చేయనున్నారు. 2027 నాటికి కొత్త పాలిమర్ నోట్లను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా సామాన్యుడికి వినియోగంలోకి తీసుకురావాలన్నది ఆర్‌బీఐ ప్రధాన ఆలోచనగా తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా చానెల్ వెల్లడించింది. ఆర్‌బీఐ తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.10, రూ.20 నోట్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్, క్షేత్రస్థాయి సవాళ్లను సమగ్రంగా పరిశీలించిన అనంతరం అవసరమైన మార్పులతో 2027 నాటికి పూర్తి స్థాయి ముద్రణను ప్రారంభించాలని అధికారులు ప్రణాళిక రచించారు. పాలిమర్ నోట్లు మార్కెట్లోకి వచ్చినా ప్రస్తుతం చెలామణీలో ఉన్న పేపర్ కరెన్సీ ఎప్పటిలాగే చెల్లుబాటు అవుతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని, దశలవారీగా మాత్రమే పాత నోట్లను పాలిమర్ నోట్లతో భర్తీ చేస్తాయని ఆర్బీఐ తెలిపింది.

దీనిపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సైతం అధికారికంగా ప్రకటించారు. కొత్త కరెన్సీని ముద్రించడానికి ఉపయోగించే అత్యంత ప్రత్యేకమైన పదార్థం 'పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల' తయారీకి ఆర్‌బీఐ నోట్ల ముద్రణా విభాగం ఇప్పటికే టెండర్లను కూడా జారీ చేసింది. ఆగస్టు 18 నాటికి తమ బిడ్లను దాఖలు చేయాలని ఆర్‌బీఐ సూచించడంతో కొత్త కరెన్సీ రాకపై వస్తున్న వాదనలకు మరింత బలం చేకూరింది.

దేశంలో డూప్లికేట్ నోట్లు మళ్లీ చెలామణిలోకి వస్తుండటంతో ఆర్బీఐ నిర్ణయం మేరకు కేంద్రం మరోసారి కరెన్సీ మార్పునకు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. కొత్తగా తయారు చేసే ప్లాస్టిక్ నోట్లు తడిచినా ఏం కాదని, సాధారణ కాగితంలా అంత సులభంగా చిరిగిపోవని అధికారులు వెల్లడించారు. పేపర్ నోట్ల మాదిగిగా మురికిగా మారి నల్లబడటం వంటి సమస్యలు అస్సలు ఉండవని, ఫలితంగా ప్రభుత్వానికి ఏటా కొత్త నోట్ల ముద్రణ కోసం అయ్యే రూ.వేల కోట్ల ఖర్చు కలిసి వస్తుందని, వీటిని పాలిమర్ నోట్లను ఫేక్ కరెన్సీగా మార్చడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.

#polymar currency#paper notes#replacement#india#RBI
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి