క్రికెట్ క్రీడాలోకంగా ప్రస్తుతం ఓ విషయంపై దీర్ఘచర్చ నడుస్తున్నది.అదే టీమిండియా దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశం. ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డే తర్వాత రోహిత్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. లార్డ్స్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటన ఉంటుందని జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మను పరిగణలోకి తీసుకోవడం లేదని బీసీసీఐ పెద్దలు ఇటీవల ప్రకటించారు.
బీసీసీఐ ఒత్తిడి మేరకు ముందుగానే రిటైర్మెంట్ ఇవ్వాలని రోహిత్ నిర్ణయించుకున్నారని సమాచారం. అందుకే రోహిత్ శర్మ తల్లిదండ్రులు లండన్ చేరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన కొడుకు చివరి మ్యాచ్ చూడాలన్న కోరిక మేరకు రోహిత్ పేరెంట్స్ తాజాగా లార్డ్స్ చేరుకున్నట్టు తెలిసింది. అదికాస్త రోహిత్ రిటైర్మెంట్ కథనాలకు మరింత ఊతమిచ్చింది.
అదంతా ఓవైపు అయితే.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ స్పందించింది.రోహిత్ అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ.. వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశాలు ఉన్నట్టు హింట్ ఇచ్చింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తాజాగా క్లారిటీ ఇచ్చారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చలు జరగలేదని వెల్లడించారు. లార్డ్స్‌లో జరిగే వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదని స్పష్టంచేశారు.
వన్డే జట్టులో ఆయన రెగ్యులర్ మెంబర్ అని తేల్చి చెప్పారు. భారత జట్టులో ఉన్నంత కాలం అతను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వెల్లడించారు. రోహిత్ రియల్ లెజెండ్ అంటూ కితాబు ఇచ్చారు.












