Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు కూడా పలు భాషల్లో సినిమాలు చేసింది లేదు. తెలుగులో నటించిన సినిమాలు ఇతర భాషల్లో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేశారు. దాంతో, అక్కడ డబ్బింగ్ ఆర్టిస్టులతో వాయిస్ చెప్పించారు తప్ప..మహేష్ వాయిస్‌ని వాడలేదు. ఆయన, ఒకే ఒక్క సినిమాకి తమిళంలో డబ్బింగ్ చెప్పాడు. ఆ సినిమా స్పైడర్. ఇది, తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కించారు కాబట్టి, రెండు భాషల్లో ఆయనే డబ్బింగ్ చెప్పారు.
ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్, ఎస్.ఎస్.కార్తికేయ కలిసి దాదాపు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 120 దేశాలలో 20 భాషలలో రిలీజ్ చేయనున్నారు. అయితే, ముఖ్యంగా మహేష్ బాబు ఎన్ని భాషల్లో డబ్బింగ్ చెప్తాడు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. తెలుగు, తమిళ భాషలలో అయితే ఖచ్చితంగా మహేష్ చెప్పగలడు.
కానీ, మిగతా 18 భాషల సంగతేంటీ? సౌత్ భాషలైన కన్నడ, మలయాళం అలాగే హిందీ భాషలలో చాలామంది స్వయంగా మహేష్ వాయిస్‌నే వినాలనుకుంటారు. మిగతా భాషలలో ఆయా భాషల్లో ఉన్న పాపులర్ డబ్బింగ్ ఆర్టుస్టులతో చెప్పిస్తారు. రాజమౌళి మేయిన్ క్యారెక్టర్స్ అన్నిటికీ వారితోనే అన్నీ సౌత్ భాషలలో డబ్బింగ్ చెప్పించడానికి ఇష్టపడతాడు. ఆర్ఆర్ఆర్ మూవీకి అంతే. రామ్ చరణ్, ఎన్‌టిర్ తెలుగుతో పాటు మిగతా భాషలలోనూ డబ్బింగ్ చెప్పారు.
కానీ, మహేష్‌కి తెలుగు, తమిళం తప్ప హిందీ, కన్నడ, మలయాళ భాషలపై అంతగా పట్టు లేదంటున్నారు. అయితే, రాజమౌళి మాత్రం ఈ 5 భాషలలో స్వయంగా మహేష్ బాబుతోటే డబ్బింగ్ చెప్పించాలని ట్రై చేస్తున్నాడు. మరి, ఇతర భాషలలో మహేష్ వాయిస్ కరెక్ట్‌గా యాప్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. కాగా, ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే, వారణాసి మూవీపై అంచనాలు అసాధారణంగా పెరిగాయి.


