సినిమా

NBK 111: డిసెంబర్ 24..రిలీజ్ డేట్ లాక్?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తన 111 చిత్రానికి సంబందించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారట. ఆ దిశగా అక్టోబర్, నవంబర్ నెలలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.

NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తన 111 చిత్రానికి సంబందించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారట. ఆ దిశగా అక్టోబర్, నవంబర్ నెలలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.

వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఎన్‌బికే 111 చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఇటీవల బాలకృష్ణకి కాకినాడ పోర్ట్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో గాయం అయింది. దీంతో, ఆయనకి సర్జరీ జరిగింది. దీంతో, ఇప్పట్లో బాలయ్య షూటింగ్‌లో జాయిన్ కాలేరని వార్తలు వచ్చాయి. దాంతో, ఈ సినిమా రిలీజ్ కూడా ఈ ఏడాది ఉండదని ప్రచారం జరిగింది.

కానీ, మొన్నామధ్య బాలయ్యే స్వయంగా గోపీచంద్ మలినేనికి కాల్ చేసి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని చెప్పాడట. వీలైనంత త్వరగా షూటింగ్‌లో జాయిన్ అవుతానని చెప్పాడట. ఇప్పుడు, దీనికి సంబందించే ఓ న్యూస్ వచ్చింది. ఈ నెలాఖరు నుంచి సెట్స్‌లో జాయిన్ అవుతాడట. అక్టోబర్, నవంబర్ నుంచి నాన్ స్టాప్‌గా షూటింగ్ జరపడానికి గోపీచంద్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే, ఇతర నటీ నటులపై టాకీ పార్ట్ పూర్తి చేస్తున్నాడు.

ఇక, బాలయ్యపై తీయాల్సిన యాక్షన్ సీక్వెన్సెస్, టాకీ పార్ట్, సాంగ్స్ కంప్లీట్ చేయనున్నారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా సమాంతరంగా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే, ఎడిటింగ్ వర్క్ జరుగుతోందట. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ వరకూ ప్రీ ప్రొడక్షన్స్ కంప్లీట్ చేసి, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్..ప్రమోషన్స్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ మొత్తం ప్రమోషన్స్ జరిపి అదే నెల 24న రిలీజ్ చేసేందుకు గోపీచంద్ సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ హాలీడేస్ టార్గెట్‌గా ఎన్‌బికే 111 రెడీ చేస్తున్నారు.

#NBK111#NandamuriBalakrishna#GopichandMalineni#Balayya
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి