సినిమా

Rukmini Vasanth: రాకింగ్ స్టార్ యష్‌పై కాంతార బ్యూటీ కామెంట్స్ వైరల్!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Rukmini Vasanth: కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ మొదటిసారి మెగా ఫోన్ పట్టి రూపొందించిన సినిమా. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి హాజరైన హీరోయిన్ రుక్మిణి వసంత్..యష్‌తో వర్క్ చేయడం గొప్ప అనుభూతి అని వ్యాఖ్యానించింది.

జీవితంలో ఒక్కసారైన యష్‌తో కలిసి నటించాలి. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఇలాంటి గొప్ప నటుడితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక, టాక్సిక్ మూవీపై మీరు చూపిస్తున్న ఉత్సాహం బాగుంది. ఇలాంటి సినిమా లాంగ్ రన్ ఉండాలని కోరింది. అలాగే, తనపై హైదరాబాద్ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదములు తెలిపింది.

టాక్సిక్ మూవీలో హీరోయిన్‌గా కియరా అద్వానీ నటించింది. కీలక పాత్రల్లో నయన్‌తార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా ఇతర కీలక పాత్రల్లో నటించారు. యష్ తండ్రీకొడులుగా నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ ఓ డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇవ్వడం పెద్ద సాహసం. మరి, ఆ సాహసం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి:

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్‌టిర్ హీరోగా రూపొందుతున్న సినిమా డ్రాగన్. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. అంతకముదు కొన్ని సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు, రిషబ్ శెట్టి నటించిన కాంతారా ఛాప్టర్ 1తో వచ్చింది. అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో. ఆ తర్వాత నుంచి రుక్మిణి వసంత్ కి వస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. టాక్సిక్, డ్రాగన్ సినిమాలు హిట్ అయితే.. ఇక ఇప్పట్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు.

#Rukmini Vasanth#Yash#Toxic#GeehuMohanDas
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి