తెలంగాణ

Hyderabad: అంజయ్య నగర్‌లో హైటెన్షన్.. ఆక్రమనిర్మాణం కూల్చివేతకు రంగం సిద్దం!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలంటే కేవలం కూల్చివేతలే కాకుండా.. నిర్మాణానికి ముందే నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పుడైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై నిరంతర చర్యలు చేపట్టి, అందరికీ ఒకే నిబంధన అమలు చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి..

అనుమతులు లేని నిర్మాణాలతో నగరం ఎంత నరకంగా మారుతుందో అందరికీ తెలిసిందే. ఇక వర్షాలు కురిస్తే నగరవాసుల కష్టాలు అంతాఇంతా కావు.. గంటలబడి ట్రాఫిక్.. రోడ్డు మీద వాగుల్లా ప్రవహిస్తున్న నీరు.. వాహణదారుల సహనానికి పరీక్షలా మారుతాయి. అయితే హైడ్రా ఆక్రమకట్టడాలపై ఎంత కఠినంగా వ్యవహారస్తున్నా కొందరు తమ పలుకుబడి ఉపయోగించుకుని పర్మిషన్లు తెచ్చుకోవడం.. ప్రజల ప్రాణాలతో చాలగాటం ఆడటం వంతు ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి..

ఇక అక్రమ నిర్మాణాల్లో కొన్ని భవనాలు నిర్మాణ దశలోనే కూలిపోవడం వల్ల జరుగుతున్న నష్టం ఒక్కోసారి అంచనా వేయడం కష్టం.. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో మరో అక్రమ నిర్మాణంపై అధికారులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేయడానికి భారీ బాహుబలి యంత్రం ఘటనా స్థలానికి చేరుకుంది. మరికొద్దిసేపట్లోనే కూల్చివేత పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ పరిసరాల్లో అక్రమ నిర్మాణాలపై కొంతకాలంగా అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అనుమతులకు మించి అంతస్తులు నిర్మించడం, సెట్‌బ్యాక్‌లు పాటించకపోవడం, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. గతంలోనూ ఈ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

అలాగే రాజకీయ, స్థానిక పలుకుబడితో నిబంధనలను పక్కనపెట్టి నిర్మాణాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల అధికారులు నోటీసులు జారీ చేయగా.. మరికొన్ని నిర్మాణాలపై కూల్చివేత చర్యలు చేపట్టారు. కాగా తాజాగా అంజయ్య నగర్‌లోని ఈ ఆరు అంతస్తుల భవనంపై చర్యలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భారీ బాహుబలి యంత్రం ఇప్పటికే అక్కడికి చేరుకోవడంతో.. కాసేపట్లో భవనం నేలమట్టం కానుంది.

మరోవైపు హైదరాబాద్‌లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలంటే కేవలం కూల్చివేతలే కాకుండా.. నిర్మాణానికి ముందే నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పుడైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై నిరంతర చర్యలు చేపట్టి, అందరికీ ఒకే నిబంధన అమలు చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి..

#Hyderabad#Gachibowli#Anjaiah Nagar#illegal construction#Hydraa#demolition
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి