సినిమా

Varanasi: ఇక మిగిలింది మహేష్ బాబు మాత్రమే..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Varanasi: ఇటీవలే, భారీ మైథలాజికల్ సినిమా రామాయణ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వచ్చింది. ఈ సినిమాను బాలీవుడ్ సీనియర్ దర్శకుడు నితిష్ తివారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సౌత్ ఫిదా బ్యూటీ సాయి పల్లవి సీతా దేవీగా కనిపించబోతోంది.

Varanasi: ఇటీవలే, భారీ మైథలాజికల్ సినిమా రామాయణ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వచ్చింది. ఈ సినిమాను బాలీవుడ్ సీనియర్ దర్శకుడు నితిష్ తివారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సౌత్ ఫిదా బ్యూటీ సాయి పల్లవి సీతా దేవీగా కనిపించబోతోంది.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసుడి పాత్రలో అలరించబోతున్నాడు. మొన్న వదిలిన థియేట్రికల్ ట్రైలర్‌లో యష్ పాత్ర విపరీతమైన పవర్‌ఫుల్‌గా అనిపించింది. ఇక, శూర్పణక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా అద్భుతంగా చేసింది. ట్రైలర్ మొత్తంలో వీరిద్దరి పాత్రలు హైలెట్‌గా అనిపించాయి. అసలు, లంకాదహనం చేసే హనుమంతుడి పాత్రకి సంబందించిన షాట్ ఒక్కటి కూడా కనిపించలేదు.

అలాగే, సీత పాత్రను పోషిస్తున్న సాయి పల్లవి తేలిపోయిందని..తన పాత్రలో హుందాతనం కనిపించలేదని అంటున్నారు. మరీ ముఖ్యంగా కొందరు బాలీవుడ్ జనాలైతే సీత పాత్రకి సాయి పల్లవి సూటవలేదంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీరాముడి పాత్రలో ఇప్పటి వరకూ నటించిన స్టార్స్ ని కంపేర్ చేసుకుంటున్నారు. అప్పట్లో శోభన్ బాబు శ్రీరాముడిగా కనిపించాడు. అద్భుతంగా సూటైంది గెటప్. ఇక, ఈ జనరేషన్ హీరోలలో ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో శ్రీరాముడిగా కనిపించాడు.

ఇవన్నీ, ఇలా ఉంటే రామాయణ మూవీలో శ్రీరాముడిగా రణ్‌బీర్ లుక్ బావుంది అన్నారే తప్ప..సూపర్..అమేజింగ్..అచ్చం ఆ శ్రీరాముడి లాగే ఉన్నాడన్న కాంప్లిమెంట్స్ మాత్రం రాలేదు. దీంతో, ఇప్పుడు అందరి దృష్టి వారణాసి సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు మీద పడింది. ఇందులో, మహేష్ ని రాజమౌళి రుద్ర, శ్రీరాముడి పాత్రల్లో చూపించబోతున్నాడు. రుద్ర పాత్రను గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో రివీల్ చేశాడు. ఇక, మిగిలింది, శ్రీరాముడిగా ఎలా ఉంటాడు అని. ఈ లుక్ కోసం ఒక్క మహేష్ అభిమానులే కాదు, యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఆ సర్‌ప్రైజ్ ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజున రివీల్ అవుతుందనే ఆశతో ఉన్నారు. మరి, జక్కన్న ఏం చేస్తడో చూడాలి.

#varanasi#maheashbabu#ssrajamouli#priyankachopra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి