National

Ruchika Singh: ప్రధాని మోదీని రాయలేని భాషలో తిట్టిన యువతికి బిగ్ షాక్.. తీవ్రంగా స్పందించిన CJP

రచన: NK4 నిమిషాల పఠనం

Ruchika Singh: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై రుచికా సింగ్ అనే యువతి రెచ్చిపోయింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. రాయలేని భాషలో ఆమె మోదీని తిట్టారు. దీంతో రుచికా సింగ్ పై కొందరు నోయిడాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

Ruchika Singh: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై రుచికా సింగ్ అనే యువతి రెచ్చిపోయింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. రాయలేని భాషలో ఆమె మోదీని తిట్టారు. దీంతో రుచికా సింగ్ పై కొందరు నోయిడాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రుచికా సింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ ఖండించారు. యువతి వ్యాఖ్యలు అభ్యంతకరంగా అనిపిస్తే పరువు నష్టం కింద ప్రొసీడ్ అవ్వాలన్నారు. అంతేకానీ క్రిమినల్ కేసు పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. నిరసనకారులపై క్రిమినల్ జస్టిస్ మెషినరీ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభ్యంతరకర భాష వాడినంత మాత్రాన శిక్షించకూడదని సౌరవ్ అన్నారు.

ఇటీవల జరిగిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసనల సందర్భంగా ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైన నోయిడాకు చెందిన రుచికా సింగ్‌కు CJP ప్రతినిధి సౌరవ్ దాస్ మద్దతు ప్రకటించారు. అధికారులు క్రిమినల్ న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “రుచికా సింగ్‌పై క్రిమినల్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ఆమోదయోగ్యం కాదు. అసభ్య పదజాలం క్రిమినల్ కేసుకు దారితీయదు” అని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.

"లోక్‌సభ ఎంపీలలో 50 శాతం మందిపై, అలాగే బీజేపీకి చెందిన దాదాపు 100 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీసులు తమ దృష్టిని వారిపై సారించాలి. అంతేకానీ 25 ఏళ్ల యువతిపై కాదు. యువతను వేధించడం వెంటనే ఆగిపోవాలి" అని సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు.

సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనల నేపథ్యంలో చేపట్టిన విస్తృత అణచివేత చర్యల్లో భాగంగానే ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నిరసనల సందర్భంగా పలు రాష్ట్రాల్లోని పోలీసులు.. హింస, ఇతర నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొందరు నిరసనకారులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా విద్యార్థులు, ఆందోళనలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని సీజేపీ పదే పదే డిమాండ్ చేస్తోంది.

#Ruchika Singh#CJP#Saurav Das#PM Modi#Abuse#Swechaa News#Criminal Case
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి