ఏపీ

AP : నో పల్స్.. చనిపోయిన మహిళను బతికించిన ‘గుంత’

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి.అది జరిగేటప్పుడు ఎవరికి తెలీదు. తెలిసాక పెద్దగా ఎవరికీ పరిచయం అక్కరలేదు. అటువంటి ఘటన ఏపీలో చోటుచేసుకుంది. చనిపోయిందని వైద్యులు నిర్దారించిన తర్వాత బాడీని తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం కుదుపునకు లోనవ్వడంతో మహిళలో చలనం వచ్చింది

ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి.అది జరిగేటప్పుడు ఎవరికి తెలీదు. తెలిసాక పెద్దగా ఎవరికీ పరిచయం అక్కరలేదు. అటువంటి ఘటన ఏపీలో చోటుచేసుకుంది. చనిపోయిందని వైద్యులు నిర్దారించిన తర్వాత బాడీని తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం కుదుపునకు లోనవ్వడంతో మహిళలో చలనం వచ్చింది.ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.

వివరాల్లోకివెళితే.. ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి కొన్నాళ్ల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది. రెండు రోజుల క్రితం ఆరోగ్యం విషమించడంతో ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి సీపీఆర్ చేసినా పల్స్ పడిపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

https://x.com/pulsenewsbreak/status/2083063475249783059?s=20

తీరా అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా బైక్‌ని తప్పించబోయి అంబులెన్స్ డ్రైవర్ పక్కకు తిప్పాడు. దీంతో ఓ గుంతలో టైరు పడటంతో అంబులెన్స్ పెద్ద కుదుపుకు గురైంది. అయితే, చనిపోయిందనుకున్న రామతులసి శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఆ మరుక్షణం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుల చికిత్స అందించడంతో రామతులసి ఆరోగ్యం మెరుగైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

#dead women#alive#andrapradesh#ambulance movement
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి