ప్రేమ, పెళ్లి పేరిట వివాహేతర సంబంధాలు, లివింగ్ రిలేషన్ షిప్స్ పెరిగిపోతున్నాయి.తీరా పెళ్లి విషయానికొచ్చేవరకు ప్రామిస్‌లు బ్రేక్ అవ్వడంతో గొడవలు ముదిరి చనిపోవడం లేదా చంపడం వరకు వెళ్తున్నారు కొందరు. ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలోని విశాఖలో వెలుగుచూసింది. ప్రేమ పేరుతో ఓ అమ్మాయికి దగ్గరైన వ్యక్తి.. పెళ్లి చేసుకోమని సదరు యువతి ఒత్తిడి చేయడంతో ఆమెను కొట్టిచంపాడు.అనంతరం మృతదేహాన్ని సూట్ కేసులో దాచి వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి వదిలేసి వచ్చాడు.
వివరాల్లోకివెళితే.. ప్రేమపేరుతో సంధ్యను లోబరుచుకున్న కంచరపాలెం దుర్గానగర్‌కు చెందిన బొలిశెట్టి సురేష్..పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాట దాటవేస్తూ వచ్చాడు. చివరికి సహనం కోల్పోయి పెళ్లి చేసుకోవాలంటూ సురేష్ ఇంటికి వెళ్లి సంధ్య గొడవ పడింది.
ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొనడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సురేష్.. ఆమె మీద దాడి చేయడంతో మృతి చెందింది.ఆధారాలు మాయం చేసే ఉద్దేశంతో సూట్‌కేసులో మృతదేహాన్ని దాచి విశాఖలోని జ్ఞానాపురం రైల్వే స్టేషన్ నుండి రైలులో ఒడిశాలోని రాయగడకు తీసుకెళ్లాడు.
https://x.com/pulsenewsbreak/status/2082989117017817531?s=20
అనంతరం చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో సూట్‌కేసుని వదిలేసి అదే రోజు రాత్రి విశాఖకు వచ్చాడు.సూట్‌కేసులో మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు.. సురేష్ ఆమెను చంపాడని తెలిసి, అతడిని అరెస్ట్ చేసి విచారించడం మొదలెట్టారు.












