క్రైమ్

HYD: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు!

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు రేగా కాంతారావుపై తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు రేగా కాంతారావుపై తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలి నుంచి రాతపూర్వక ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేశారు.

బాధితురాలు అందించిన వివరాల ప్రకారం... పెళ్లి నెపంతో తనను లొంగదీసుకోవడమే కాకుండా, తన అనుమతి లేకుండానే వ్యక్తిగత క్షణాలను రహస్యంగా వీడియోలు తీశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ దృశ్యాలను చూపిస్తూ తనను మానసికంగా, భౌతికంగా వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

కేవలం లైంగిక వేధింపులే కాకుండా ఆర్థిక మోసానికి కూడా పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయని నమ్మించి, పెట్టుబడుల పేరుతో తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BMS) 69 సెక్షన్‌తో పాటు, 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.

#Rega Kantha Rao Case#BRS Leader Rega Kantha Rao#Panjagutta Police Case#Former MLA Rega Kantha Rao#Rega Kantha Rao Allegations#Telangana Politics News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి