చిన్నారులు, మైనర్లపై ఇటీవలి కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తెలిసిన బంధువులు,ఇరుగుపొరుగు వారే బాలికలపై కన్నేసి వారి కామకోరికలను తీర్చుకుంటున్నారు. ఇదిలాఉంటే సమాజాన్ని కాపాడతామని, ప్రజలకు రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేసిన వారు సైతం మృగల్లా మారి చిన్నారులను బలితీసుకుంటున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు ఆమెను చంపి నదిలో పారేశాడు.ఈ ఘటన యూపీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
గోరఖ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కకు అన్నం ఇచ్చి.. పదేండ్ల బాలిక ఇంటికి తిరుగుపయనమైంది. ఈ క్రమంలోనే ఇంటి వద్ద దింపుతానని నమ్మించి.. బాలికను బైక్‌పై ఎక్కించుకున్న కానిస్టేబుల్ అభిషేక్ యాదవ్(35).. ఓ స్మశానవాటికకు తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేసి ఆపై చంపేసి నదిలో మృతదేహాన్ని పడేశాడు. తమ చిన్నారి కనిపించకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అభిషేక్ యాదవ్ ఆ బాలికని బైక్‌పై తీసుకెళ్లడాన్ని గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా అతను ఇచ్చిన సమాచారంతో నదిలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం
https://x.com/pulsenewsbreak/status/2083002706772332809?s=20
వైద్య పరీక్షల కోసం అభిషేక్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రి సిబ్బంది అంతా కలిసి అతనిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అయితే, వారిని అడ్డుకుని పోలీసులు సురక్షితంగా స్టేషన్ తరలించినట్టు తెలిసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.












