సినిమా

Urmila Matondkar: వాట్‌.. ఆ స్టార్ హీరోయిన్‌తో ఆర్జీవీకి పెళ్లైందా..?

రచన: Anshu5 నిమిషాల పఠనం

Urmila Matondkar: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ఒకప్పటి గ్లామర్ క్వీన్ ఊర్మిళా మాతోండ్కర్ మధ్య నడిచిన అనుబంధం గురించి బాలీవుడ్‌లో దశాబ్దాలుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘రంగీలా’, ‘సత్య’ వంటి క్లాసిక్ సినిమాలతో ఈ జోడీ సృష్టించిన మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీరిద్దరి ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ వెనుక ఓ బలమైన వ్యక్తిగత బంధం, సీక్రెట్ మ్యారేజ్ కోణాలంటూ తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని నిజాలు సినీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.

తాజాగా ఓ ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ పంచుకున్న ఆసక్తికర విషయాలు ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఒకానొక సమయంలో ఓ ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో స్వయంగా తనను సంప్రదించి ఆర్జీవీ, ఊర్మిళ పెళ్లి వార్తపై ఆరా తీశారట. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని ఒకానొక ప్రాచీన ఆలయంలో వీరిద్దరికీ రహస్యంగా వివాహం జరిగిందని, ఆ పెళ్లి తంతును దగ్గరుండి జరిపించిన పూజారి నంబర్ కూడా ఆ తెలుగు హీరో తనకిచ్చినట్లు జ్యోతి వెంకటేష్ సంచలన నిజాలు బయటపెట్టారు.

ఈ వార్త నిజానిజాలను నిర్ధారించుకునేందుకు జ్యోతి వెంకటేష్ నేరుగా నటి ఊర్మిళను సంప్రదించగా ఊహించని పరిణామం ఎదురైందట. ఆమెతో మాట్లాడినప్పుడు ఆ వార్తను ఆమె నేరుగా ఖండించలేదని, పైగా ఏడుస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. మరోవైపు ఈ వివాహంపై రామ్‌గోపాల్ వర్మను వివరణ కోరగా.. ఆయన మాత్రం దీనిపై స్పందించేందుకు పూర్తిగా నిరాకరించారట.

అయితే వీరిద్దరి మధ్య ఇంతటి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో ఎందుకు విడిపోయారనే ప్రశ్నకూ జ్యోతి వెంకటేష్ సమాధానమిచ్చారు. ఆర్జీవీతో కేవలం సహజీవనం లేదా భావోద్వేగ బంధానికే పరిమితం కాకుండా, లీగల్‌గా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా అధికారిక హోదా పొందాలని ఊర్మిళ తీవ్రంగా కోరుకున్నారట. కానీ అందుకు ఆర్జీవీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకపోవడంతోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

కాగా, గతేడాది ‘సత్య’ సినిమా రీ-రిలీజ్ వేళ జరిగిన ఇంటర్వ్యూలలో తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఊర్మిళ స్పష్టం చేసినప్పటికీ.. ఈ తాజా లీక్స్ మాత్రం బాలీవుడ్‌లో దశాబ్దాలుగా నలుగుతున్న గుసగుసలకు మరోసారి ప్రాణం పోశాయి. ఆర్జీవీ-ఊర్మిళ బంధంపై వస్తున్న ఈ సరికొత్త చర్చ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

#Urmila Matondkar#Ramgopalvarma#rgv#Urmila
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి