భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం మరో వేగవంతమైన, సౌకర్యవంతమైన క్రెడిట్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. 'పేయూ ఫైనాన్స్'తో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ (Flipkart Pay Later) సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. కొనుగోలుదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడమే ధ్యేయంగా తీసుకొచ్చిన ఈ సర్వీస్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మింత్రా, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా నేరుగా ఉపయోగించుకోవచ్చు.
ఈ కొత్త సదుపాయంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మూడు ప్రధాన చెల్లింపుల విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ‘పే లేటర్’ ఎంచుకుంటే కొనుగోలు చేసిన సరుకులకు 30 రోజుల వ్యవధి తర్వాత చెల్లింపులు చేయవచ్చు. ఇక ‘పే ఇన్ 3’ విధానంలో మొత్తం బిల్లును ఎటువంటి భారం లేకుండా మూడు విడతలుగా చెల్లించే వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్, ఇతర గృహోపకరణాలకు 3 నెలల నుంచి 12 నెలల వరకు సరసమైన ఈఎంఐ (EMI) ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, క్యాష్ ఆన్ డెలివరీ వంటి రకరకాల చెల్లింపు మార్గాలు ఉండగా, ఈ కొత్త 'పే లేటర్' సేవ చేరడంతో వినియోగదారుల షాపింగ్ అనుభవం మరింత సులభతరం కానుంది. రాబోయే పండుగల సీజన్ మరియు సేల్స్ సమయాల్లో వినియోగదారులకు తక్షణ ఆర్థిక సదుపాయాన్ని అందించి షాపింగ్‌ను మరింత సులభతరం చేయడం ఈ ఆఫర్ ప్రధాన ఉద్దేశం.
ఆగస్టు 8 నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న ‘ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్’కు సరిగ్గా ముందే ఈ కీలక ప్రకటన రావడం గమనార్హం. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులకు ఒకరోజు ముందే, అంటే ఆగస్టు 7 నుంచే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపే కస్టమర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.












