జువెల్లరీ షాపులో ఎక్కడ చూసిన బంగారం, అభరణాలు కనిపిస్తుంటాయి. కస్టమర్లు వస్తే వారికి చూపించాక తిరిగి మళ్లీ యథాతథ స్థితిలో వాటిని ఉంచుతారు. షాపులో 24/7 సీసీ కెమెరాలు అన్నింటినీ రికార్డు చేస్తుంటాయి.దొంగతనం చేయడానికి బయటివారు తప్ప షాపులోని వారు మాత్రం అస్సలే సహసించరు. ఈ క్రమంలోనే ఓ బంగారు షాపులో రూ.10 లక్షల విలువైన ఉంగరాలు,నగలు మిస్ అయ్యాయి.
గుర్తించిన సిబ్బంది వెంటనే మేనేజర్‌కు సమాచారం ఇవ్వగా ఆయన కంగారు పడిపోయారు.సిబ్బంది మొత్తాన్ని ఆరాతీశారు. వారు తీయలేదని పేర్కొనడంతో సీసీ కెమెరాల ఫుటేజీని బయటకు తీశారు. తీరాచూస్తే వారికి మైండ్ బ్లాంక్ అయ్యే దృశ్యాలు కనిపించాయి. ఆ బంగారు అభరణాలు దొంగిలించింది సిబ్బంది కాదు.. దొంగలు కాదు.. ఒక ఎలుక(RAT). ఎలుక నెమ్మదిగా ఒక్కొక్క బంగారు ఉంగరాలు, ఐటమ్స్‌ను నోటకరుచుకుని వెళ్లి అది తవ్విన కన్నెంలో దాచిపెట్టినట్టు సిబ్బంది గుర్తించారు.
https://x.com/greatandhranews/status/2082866307775783108?s=20
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని తుమకూరులో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏకంగా రూ.10 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు మాయం చేసిన ఎలుకను పట్టుకునేందుకు సిబ్బంది నానా తంటాలు పడ్డారు. చివరకు కన్నంలోకి లాక్కెళ్లిన 10 ఉంగరాలు, 2 గొలుసులను తవ్వి బయటకు తీశారు. అభరణాలు దొరకడంతో షాపు సిబ్బంది, మేనెజ్మెంట్ సైతం ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఎలుక బంగారం దొంగిలిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.












