Ramayana-Adipurush: బాలీవుడ్ తెరపై తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్, హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అయితే, గతంలో ఇదే కథాంశంతో వచ్చి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో దీనిని పోల్చి చూసుకోవడం ఎప్పుడో మొదలైంది. తాజాగా విడుదలైన ‘రామాయణ’ ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆ అంచనాలను నిజం చేస్తూ, విజువల్ పరంగా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించాయి.
గ్రాఫిక్స్, మేకింగ్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి ప్రతి అంశంలోనూ ‘రామాయణ’ మేకర్స్ ‘ఆదిపురుష్’ను ఎంతో వెనక్కి నెట్టేశారనేది అందరూ ఒప్పుకుంటున్న నిజం. తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్ అత్యంత రిచ్‌గా, కనులపండువగా ఉండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. విజువల్స్ పరంగా ఈ చిత్రం సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ, సినీ సర్కిల్స్‌లోనూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎంత పెద్ద భారీ తారాగణం, హాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్ హన్స్ జిమ్మర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులు జతకట్టినప్పటికీ.. ‘ఆదిపురుష్’ క్రియేట్ చేసిన ఆ మ్యూజికల్ మ్యాజిక్‌ను ‘రామాయణ’ పూర్తిగా అందుకోలేకపోయిందనే వాదన వినిపిస్తోంది.
‘ఆదిపురుష్’ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, ఆ చిత్రంలోని పాటలు మరియు అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే గూస్‌బంప్స్ వేరే లెవెల్‌లో ఉంటాయని ఆడియెన్స్ ఇప్పటికీ గట్టిగా చెబుతున్నారు. ఈ ఒక్క మ్యూజికల్ యాంగెక్స్ విషయంలో మాత్రం రామాయణ కంటే ఆదిపురుషే బెస్ట్ అనే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, బాలీవుడ్ రామాయణలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా యశ్ నటించారు. గురువారం విడుదలైన ట్రైలర్‌లో అత్యంత ఎక్కువగా ప్రశంసలు అందుకుంటున్న పాత్ర యష్‌దే. ఆయన లుక్‌తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.












