సినిమా

Kiara Advani: "టాక్సిక్" నా డ్రీమ్ రోల్..ఎవరెన్ని తిట్టినా డోంట్ కేర్..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Kiara Advani: "టాక్సిక్" నా డ్రీమ్ రోల్..ఎవరెన్ని తిట్టినా డోంట్ కేర్..అంటూ తాజాగా నటించిన ఈ సినిమాలోని తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది కియారా అద్వానీ. తెలుగులో ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ 'భరత్ అనే నేను' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. హోంలీ రోల్ లో నటించి తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.

ఆ తర్వాత, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'విన విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు గనక హిట్ అయి ఉంటే టాలీవుడ్ లో కియారా జర్నీ ఇంకోలా ఉండేది. కానీ, ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ తోనే గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' మూవీలో యష్ సరసన ఛాన్స్ అందుకుంది.

ఈ సినిమా కియారాకి చాలా ప్రత్యేకం అంటోంది. ఇంకా, చెప్పాలంటే తన డ్రీమ్ రోల్ అని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల, 'టాక్సిక్' సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యష్, కియారాలపై చిత్రీకరించిన ఓ రొమాంటిక్ సమగ్ ని వదిలారు. అది, చూశాక.. పెళ్ళై ఓ బిడ్డకి తల్లైనా కూడా ఇలాంటి డ్రస్ వేసుకోవడానికి, ఇంత ఘాటు రొమాంటిక్ సాంగ్స్ చేయడానికి మనసు ఎలా ఒప్పింది.. అంటూ కొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేశారు.

దీనికి స్పందించిన కియారా, లైఫ్ లో కొన్ని పాత్రలను చేయాలని కలలు కంటాము. అలాంటి పాత్రే 'టాక్సిక్' లో 'నాడియా'. నన్ను సంపూర్ణంగా సంతృపి పరిచిన పాత్ర. గీతు మోహన్ దాస్ ఈ రోల్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయానని తెలిపింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయని, అందుకే అందుకు తగ్గట్టే నటించానని ట్రోలర్స్ కి గట్టిగా రిప్లై ఇచ్చింది కియారా అద్వానీ. కాగా, ఈ సినిమాలో యష్-కియారా ల స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉండబోతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

#Kiara Advani#Toxic#Yash#GeethuMohanDass
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి