Shruti Haasan: చాలామంది స్టార్స్ నట వారసులుగా, వారసురాలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. అయితే, తండ్రి గానీ..తల్లి గానీ స్టార్స్ అయి ఉంటే వాళ్ళ వారసుల ఎంట్రీకి మొదటి సినిమా వరకే పరిమితం తప్ప..జీవితాంతం కాదు. దర్శకరత్న దాసరి నారాయణ రావు ఎందరినో స్టార్స్‌గా మలిచారు. కానీ, ఆయన కొడుకును మాత్రం స్టార్ హీరోను చేయలేకపోయారు. ఆ వెలితి ఎప్పటికీ ఉంటుందని కూడా ఆయన సన్నిహితుల వద్ద అనేవారట.
ఇలా, ఇండస్ట్రీలో చాలామంది అగ్ర స్థానానికి రాకుండా నిలిచిపోయారు. వీరిలో లోక నాయకుడు కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ మాత్రం డిఫరెంట్. తండ్రి సౌత్ లోనే అగ్ర కథానాయకుడు, నిర్మాత, దర్శకుడైనా కూతురు మాత్రం స్టార్ గా ఎదగడానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణమయ్యాడు. అదెలా అంటారా..
శ్రుతి హాసన్ ముందుగా 'లక్' అనే సినిమాతో బాలీవుడ్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో, తెలుగులో హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాలన్నీ ఫ్లాపవుతూ వచ్చాయి. ఇదే, సమయంలో శ్రుతి హాసన్ ఐరన్ లెగ్ అని కూడా అనిపించుకుంది. కానీ, ఆ పేరు ఎంతకాలమో మోయలేదు. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది.
ఆ సినిమానే పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ 'గబ్బర్‌సింగ్'. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'దబాంగ్' మూవీకి తెలుగు రీమేక్‌గా హరీష్ శంకర్ రూపొందించాడు. ఈ సినిమాకి నిర్మాత బండ్ల గణేష్. ఒక సమయంలో పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్ నేరుగానే ఆ అమ్మాయికి ఒక్క హిట్టూ లేదు..తీసేద్దాం బాబు అని కూడా సలహా ఇచ్చాడు. నువ్వేమన్నా 10 హిట్ సినిమాలు తీసావా..అవసరం లేదు..ఆ అమ్మాయే హీరోయిన్..అని శ్రుతి హాసన్ ని రీప్లేస్ చేయనివ్వలేదు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక బండ్ల గణేష్ చెప్పిన మాట విని గబ్బర్‌సింగ్ సినిమా నుంచి శ్రుతిని తీసేసి ఉంటే ఇప్పుడు ఆమె కెరీర్ ఎలా ఉండేదో. కానీ, ఈ సినిమాలో ఉండటం..అది ఇండస్ట్రీ హిట్ అవడం..ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకోవడంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. మహేష్ బాబు, మెగాస్టార్, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, ప్రభాస్..ఇలా అందరూ బిగ్ స్టార్స్ తో తెలుగు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇప్పటికీ శ్రుతి హాసన్ ఇండస్ట్రీకొచ్చి 17 ఏళ్ళు పూర్తైంది. త్వరలో, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తో నటించిన 'ట్రైన్' సినిమాతో మన ముందుకు రాబోతోంది.












