టాప్ న్యూస్

Sudesh Berry : ప్రధాని మోడీ విష్ణు అవతారం.. యాక్టర్ సంచలన వ్యాఖ్యలు

రచన: Kumar3 నిమిషాల పఠనం

పార్లమెంట్ సమావేశాలు ఓవైపు కొనసాగుతుంటే.. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.పంజాబ్‌లో రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేసేలా చేయడం ,

పార్లమెంట్ సమావేశాలు ఓవైపు కొనసాగుతుంటే.. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.పంజాబ్‌లో రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేసేలా చేయడం ,మరోవైపు నీట్ పేపర్ లీకేజీ అంశంలో విద్యార్థులు, యువతను రెచ్చగొట్టేలా సీజేపీ ప్రయత్నిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల కోసం కేంద్రం ఇప్పటికే యాంటీ పేపర్ లీకేజీ బిల్లును తీసుకొచ్చింది. ఇకమీదట లీకులకు ఎవరైనా పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది.

ఈ క్రమంలోనే పేపర్ లీకులు, ఉద్యమాలు, కాక్రోజ్ పార్టీ ప్రతినిధులపై బాలీవుడ్ యాక్టర్ సుదేశ్ బెర్రీ తీవ్ర విమర్శలు గుప్పించారు.అలాగే ప్రధాని మోడీ భగవాన్ విష్ణు అవతారం అని కొనియాడారు. కరోనా సమయంలోదేశప్రజలందరినీ కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. ఏదో ఒక రకంగా భారతీయులకు ఆయన అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

అవకాశం దొరికితే ఆయన కాళ్లు కడిగి, ఆ నీటిని తాగుతానని సంచలన ప్రకటన చేశారు. కనిపించని దేవుడు లాగా ప్రధాని నరేంద్ర మోడీని ఆరాధిస్తానని సుదేశ్ బెర్రీ చెప్పడం బాలీవుడ్ ఇండస్ట్రీలో కీలక చర్చ‌కు దారితీసింది.అదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీపై బెర్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏం తప్పు చేశాడని, ఆయనను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారంతా పనికిరాని వాళ్ళని, భారతదేశాన్ని వెనక్కి లాగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను అస్సలు నమ్మకూడదని దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

#pm modi#actor sudesh berri#bollywood#praise lord vishnu avatar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి