NTR: మన స్టార్స్ కేవలం సినిమాలలో హీరోలుగా మాత్రమే కాకుండా ఇతర వ్యాపార రంగాలలోకి అడుగుపెడుతున్నారు. నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ మాత్రమే కాకుండా సొంత థియేటర్స్ ని నిర్మిస్తున్నారు. ఏషియన్ వారితో కలిసి మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ మొదలు పెట్టాడు. ఈ రంగంలోకి వచ్చింది మొదట మహేష్ బాబే. హైదరాబాద్ గచ్చిబౌలి లో ఈ హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఉన్న మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేశాడు.
ఆ తర్వాత అల్లు అర్జున్ అమీర్ పెట్ లోని సత్యం థియేటర్స్ స్థానంలో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఇలాగే, థియేటర్స్ బిజినెస్ లోకి ఎంటరయ్యారు. ఇటీవలే, కోకాపేట్ లో అల్లు సినిమాస్ ని బన్నీ ప్రారంభించాడు. కేవలం యాంబియెన్స్ చూసేందుకే ప్రేక్షకులు అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ని సందర్షిస్తున్నారు. యంగ్ హీరోలు సందీప్ కిషన్ లాంటి వారు రెస్ట్రారెంట్స్ ని ప్రారంభించారు.
అయితే, అల్లు అర్జున్..మహేష్ బాబు..రవితేజ బాటలో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్‌టిర్ కూడా కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. కోకాపేట్ ప్రాతంలోనే తారక్ కూడా భారీ హంగులతో మల్టీప్లెక్స్ ని నిర్మించనున్నాడట. ఇదే, నిజమైతే తాతగారి పేరు మీదే ఆ మల్టీప్లెక్స్ మొదలవుతుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.
ఇక, తారక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) మూవీని చేస్తున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్‌టిర్ ఆర్ట్స్ బ్యానర్స్ మీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2027 లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. దీని, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ మూవీని చేయనున్నాడు.












