సినిమా

SS Rajamouli: 1400 కోట్ల బడ్జెట్ తో ఆగుతాడా..ఇంకా పెంచుతాడా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

SS Rajamouli: ఎస్.ఎస్.రాజమౌళి..మన తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి చాటిచెప్పిన తెలుగు దర్శకుడు. ఒకప్పుడు, బాలీవుడ్ సహా హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మన తెలుగు సినిమాను, తెలుగు మేకర్స్ ని ఎంతో చులకనగా మాట్లాడేవారు. కానీ, రాజమౌళి వచ్చాక, అదే హాలీవుడ్ మేకర్స్ మన తెలుగు సినిమాను, కథలను, దర్శకులను, హీరోలను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

SS Rajamouli: ఎస్.ఎస్.రాజమౌళి..మన తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి చాటిచెప్పిన తెలుగు దర్శకుడు. ఒకప్పుడు, బాలీవుడ్ సహా హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మన తెలుగు సినిమాను, తెలుగు మేకర్స్ ని ఎంతో చులకనగా మాట్లాడేవారు. కానీ, రాజమౌళి వచ్చాక, అదే హాలీవుడ్ మేకర్స్ మన తెలుగు సినిమాను, కథలను, దర్శకులను, హీరోలను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

ఒక సాధారణ కమర్షియల్ కథను ఇంటర్నేషనల్ లెవల్ లో తీసి గొప్ప దర్శకుడు అనిపించుకున్నాడు రాజమౌళి. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ అవార్డ్స్ ని తెచ్చిపెట్టాడు. స్టూడెంట్ నంబర్ 1 తో దర్శకుడిగా మారిన రాజమౌళి సింహాద్రి, ఛత్రపతి, యమదొంగ, మగధీర, సై, మర్యాద రామన్న, విక్రమార్కుడు లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు.

ఇక, ప్రభాస్-రానా-అనుష్కశెట్టి-రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందించిన బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీని సాధించాడు. వంద కోట్ల సినిమా నిర్మాణాన్ని వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టేలా సినిమా స్థాయిని పెంచాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఏ రేంజ్ లో తీసుకెళ్ళాడో అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'వారణాసి' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.

120 దేశాలలో 20 భాషలలో రిలీజ్ కి ప్లాన్ చేయడం రాజమౌళి సాహసానికి పెద్దపరీక్ష. అంతేకాదు, వారణాసి బడ్జెట్ 1000 కోట్ల లోపే అన్నారు. కానీ, ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నదాన్ని బట్టి 1400 కోట్ల రూపాయలతో డా.కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్, బాలీవుడ్ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. ఈ సినిమా ఏ స్కేల్ లో తయారవుతుందో ఊహించుకోవడం కూడా కష్టం. అయితే, వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా బడ్జెట్ తగ్గుతుందా..ఇంకా పెంచుతాడా..అనేది ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉన్న స్టార్ మేకర్స్ అనుకుంటున్నారు. ఈ 1400 కోట్లతో ఆగితే సంతోషమే..అది దాటి ఆలోచితే హాలీవుడ్ మేకర్స్ కూడా రాజమౌళి సలాం కొట్టాల్సిందే.

#ssrajamouli#maheashbabu#varanasi#priyankachopra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి