సినిమా

Rashmika Mandanna: రష్మిక నడుముకు గాయం..ఎందుకు జరిగిందంటే!

రచన: Anshu3 నిమిషాల పఠనం

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న హిప్ కి తీవ్రంగా గాయమైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల మన స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్‌టిర్, రామ్ చరణ్ ఇలాగే గాయాలపాలై సర్జరీ చేయించుకున్నారు. ఈ ముగ్గురు కనీసం 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. బాలయ్య అయితే, అక్టోబర్ వరకూ షూటింగ్ లో పాల్గొనలేని పరిస్థితి.

ఇలా, వరుసగా హీరోలు యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్న సమయంలో భుజానికి, మోకాళ్లకి, మణికట్టు పాత్రంలో దెబ్బ తీవ్రంగా తగలడంతో డాక్టర్లు సర్జరీ నిర్వహించి కొన్ని వారాల పాటు రెస్ట్ తీసికోవాలని సూచించారు. ఇప్పుడు, ఈ ముగ్గురు హీరోలు పూర్తిగా ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా గాయపడింది.

ప్రస్తుతం, రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ సరసన రణబాలి చిత్రంలో నటిస్తోంది. అలాగే, పాన్ ఇండియా సినిమా మైసాలోనూ నటిస్తోంది. ఇది, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. ఇటువంటి భారీ చిత్రాల షూటింగ్‌లలో వరుసగా పాల్గొంటున్న రహ్మిక..వీటి కోసం కఠినమైన యాక్షన్ సీక్వెన్సులను, విపరీతమైన డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌లను చేస్తోంది.

ఈ నేపథ్యంలో, రష్మిక హిప్ ఏరియాలో టెండన్ డిటాచ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఓ సినిమా డ్యాన్స్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. దీంతో ఆమె విపరీతంగా గాయానికి గురైనట్లు సమాచారం. టెస్టులు నిర్వహించిన డాక్టర్లు సాధారణంగా ఇలాంటి గాయాలు..క్రీడాకారిణికి జరుగుతుందని షాకయ్యారట. ఇక, రష్మిక పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. ప్రస్తుత, ఆమె రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

#Rashmika Mandanna#Ranabaali#Vijaydevarakonda#Mysa
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి