Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందారు. అర్థరాత్రి తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ నెల 26న హనుమకొండలోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 6 రోజులు యశోద ఆస్పత్రి డాక్టర్లు పెద్ది ప్రాణాలను నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ, అవేవీ ఫలించలేదు.












