తెలంగాణ

Telangana: గోదావరి ఉగ్రరూపం..భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక!..

రచన: Venu3 నిమిషాల పఠనం

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, డ్యామ్ లు అన్నీ నిండిపోతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో నేడు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది.

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, డ్యామ్ లు అన్నీ నిండిపోతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో నేడు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం అధికారికంగా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.

ప్రస్తుతం నదిలో నీటిమట్టం 11,44,645 క్యూసెక్కులకు పెరిగిందని, అయితే ప్రవాహం నిలకడగా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు గోదావరి వరద నిబంధనల ప్రకారం భద్రాచలం వద్ద 43 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు.

అయితే వర్షాలు ఇలాగే కొనసాగితే వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, అధికారులందరినీ పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గోదావరి ఫ్లడ్ మాన్యువల్'ప్రకారం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. కాగా ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు భద్రాచలం వద్ద 1986లో భారీ వరద సంభవించింది. ఆ సమయంలో గోదావరి నీటిమట్టం రికార్డు స్థాయిలో 75.60 అడుగులకు చేరి, 27.02 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ నమోదైంది. ఆ తర్వాత ఇటీవల 2022లో నీటిమట్టం 71.30 అడుగులకు చేరి, 24.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు ప్రవహించింది.

#Telangana#Bhadrachalam#GodavariFloods#Kothagudem#second danger#warning issued
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి