Telangana High Court: లోతుకుంట భూముల వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కేసులో ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించాలని ఈ నెల 27న కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. దానికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీ ఇవాళ బయటకు వచ్చింది. అందులో కీలక అంశాలు ఉన్నాయి.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను వీలైనంత త్వరగా తప్పించి, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్ కు సూచన చేసింది కోర్టు. చట్టపరమైన పాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని తేల్చి చెప్పింది. వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని హెచ్చరించింది. హైడ్రా, శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ కేసులో కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్న సుస్పష్టం అని తెలిపింది న్యాయస్థానం. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్ట విరుద్ధమంది.
చట్ట పాలనే గెలవాలి, వ్యక్తుల పాలన కాదు.
వ్యక్తుల పాలన గెలిస్తే, అది ప్రజాస్వామ్యానికి మరణ ఘంటిక
ఇది చట్ట పాలనపై వ్యక్తుల పాలన గెలవాలని ప్రయత్నించిన క్లాసిక్ కేసు
నిజమైన ప్రజాస్వామ్యంలో ఇది కలగానే మిగిలిపోవాలి
బై
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
కాంటెంప్ట్ కేస్ నెం. 3482, 3483/2026
ఆర్డర్ తేదీ: 27.07.2026
పిటిషనర్ భూమి (లోతుకుంట గ్రామం, మల్కాజ్‌గిరి మండలం, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, సర్వే నెం. 1 మరియు 2లోని 40 ఎకరాలు)లో
17/18.07.2026న HYDRAA అధికారులు, పోలీసులు, యంత్రాలతో ప్రవేశించి, తాత్కాలిక నిర్మాణాలను (కాంపౌండ్ వాల్, బ్లూ టిన్ షీట్లు) కూలగొట్టి, ఫెన్సింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఇది 10.06.2026న కాంటెంప్ట్ కేసులు 2447 & 2448/2026లో ఇచ్చిన ఆర్డర్ మరియు అండర్ టేకింగ్‌ను ఉద్దేశపూర్వకంగా, స్వచ్ఛందంగా ఉల్లంఘించడమేనని పిటిషనర్ ఆరోపించారు.
డబ్ల్యూపీ నెం. 5049/2016లో 08.03.2021న హైకోర్టు భూమి ఆక్రమణ చట్టం ప్రకారం జరిగిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసి, పిటిషనర్‌కు పొజెషన్ పునరుద్ధరించాలని, సివిల్ కోర్టు డిక్రీ లేకుండా రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది.
* రాష్ట్రం దాఖలు చేసిన ఓఎస్ నెం. 55/2021ను లిమిటేషన్ కారణంగా రిజెక్ట్ చేశారు.
* సిటీ సివిల్ కోర్టు అప్పీల్ నెం. 49/2022ను 07.10.2025న డివిజన్ బెంచ్ కొట్టివేసింది. పిటిషనర్ టైటిల్ వచ్చింది.
HYDRAA ప్రవేశించినందుకు 10.06.2026న స్టాండింగ్ కౌన్సిల్ అండర్ టేకింగ్ ఇచ్చారు. కోర్టు ఆ అండర్ టేకింగ్‌ను రికార్డ్ చేసి, HYDRAA అధికారులు/సిబ్బంది పిటిషనర్ భూమిలోకి ప్రవేశించకూడదని ఆదేశించి కేసులు మూసివేసింది. అయినా 17/18.07.2026న HYDRAA మళ్లీ భూమిలోకి ప్రవేశించి, ప్రభుత్వ భూమి (GLR) అని చెప్పి ఫెన్సింగ్ చేయడానికి ప్రయత్నించింది. పిటిషనర్‌కు నోటీసు ఇవ్వలేదు. రెవెన్యూ శాఖ నుండి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు.
* HYDRAA సిబ్బంది చర్యలు కోర్టు ఆర్డర్‌ను ఉద్దేశపూర్వకంగా, స్వచ్ఛందంగా ఉల్లంఘించడం, అండర్ టేకింగ్‌ను భంగపరచడం.
* రెవెన్యూ శాఖ నుండి ఫెన్సింగ్ కోసం ఎలాంటి అభ్యర్థన లేదు.
* పిటిషనర్‌కు నోటీసు ఇవ్వలేదు.
* కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్లు అస్పష్టంగా ఉన్నాయి.
* మొదటి అఫిడవిట్‌లో క్షమాపణ లేదు.
* రెండవ అఫిడవిట్‌లో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే క్షమాపణ చెప్పారు.
* కోర్టు ఆ క్షమాపణను తిరస్కరించింది
(సి. ఎలుమలై కేసు ఆధారంగా).
HYDRAA చట్టంపైన కాదు. రాష్ట్ర వివిధ శాఖలు ఒకే శరీరంలోని అవయవాలు. వాటి మధ్య సమన్వయం ఉండాలి.
కాంటెమ్నర్ 62 కాంటెంప్ట్ కేసుల్లో పార్టీగా ఉన్నారని కోర్టు గమనించింది.
ఈ చర్యలు న్యాయపాలనకు అంతరాయం కలిగించాయి, కోర్టుల గౌరవాన్ని, చట్ట పాలనను దెబ్బతీశాయని పేర్కొంది.
కోర్టు HYDRAA చర్యలను ఉద్దేశపూర్వక అవిధేయతగా పరిగణించింది.
“న్యాయ మహత్తు శిక్షించడంలో కాదు, క్షమించడంలో ఉంది” అనే సూత్రాన్ని (టాటా మోహన్ రావు కేసు) అనుసరించి, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ చట్టం కింద జైలు శిక్ష లేదా జరిమానా విధించలేదు.
బదులుగా ఈ కింది ఆదేశాలు ఇచ్చింది:
ఏవీ రంగనాథ్, ఐపీఎస్‌ను HYDRAA కమిషనర్ పదవి నుండి విముక్తి చేయాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీలైనంత త్వరగా తగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించి, ప్రస్తుత అధికారిని విముక్తి చేయాలని కోరింది.
కాంటెంప్ట్ కేసులు పైన పేర్కొన్న నిబంధనలతో మూసివేయబడ్డాయి.
ఖర్చులు లేవు.
రిజిస్ట్రీ ఈ ఆర్డర్‌ను ప్రధాన కార్యదర్శికి పంపాలని ఆదేశించబడింది.












