Jaya Krishna Ghattamaneni: ఘట్టమనేని వారసుడిని అస్సలు పట్టించుకోలేదే? అవును..శ్రీనివాస మంగాపురం సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు..దివంగత రమేష్ బాబు తనయుడు హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు. అయితే, ఇంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ జయకృష్ణ ని ఎవరూ పట్టించుకోలేదనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీనికి, కారణం ఈ యంగ్ హీరో నటించిన సినిమా మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం.
సూపర్ స్టార్ మహేష్ బాబు గనక పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఫలితం ఇలా ఉండేది కాదంటున్నారు. మొదటి నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్నప్పటికీ, సరైన ప్రమోషన్స్, ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివేమీ లేకపోవడంతో పాటు మహేష్ కూడా జయకృష్ణ ఎంట్రీ సినిమాకి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వలేదంటున్నారు.
గ్రాండ్ గా ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ నిర్వహించి..ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కండెక్ట్ చేసి దానికి, మహేష్ గనక వచ్చి ఉంటే కాస్త సినిమాపై టాక్ ఇంకోలా ఉండేది. పాతకాలపు కథ, పేలవమైన దర్శకత్వం..హెవీ బడ్జెట్ వల్ల అనవసరంగా ప్రమోషన్స్ నిర్వహించి డబ్బు ఖర్చు ఎందుకులే అనుకున్నారని కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు. నట వారసుడి ఎంట్రీ అంటే ప్రమోట్ ఎలా చేయ్యాలో అందులో కొద్ది శాతం కూడా చెయ్యలేదని అర్థమవుతూనే ఉంది.
ఇక, కథ-కథనాలు దారుణంగా ఉండటంతో మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో, శ్రీనివాస మంగాపురం మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరి, బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నప్పటికీ జయకృష్ణ ఎంట్రీ ఎందుకిలా అయిందంటే సరైన సమాధానం దొరకడం లేదు. జయకృష్ణ అదిగితే చిన్న వీడియో బైట్ మాత్రమే ఇచ్చిన మహేష్..ఎందుకు ఫ్రెంట్ లైన్ లో ఉండి జయకృష్ణని ప్రమోట్ చేయలేదో అని ఇండస్ట్రీ వర్గాలలో రక రకాల చర్చలు సాగుతున్నాయి. కాగా, శ్రీనివాస మంగాపురం సినిమాతో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా పరిచచయమైంది. అజయ్ బూపతి దర్శకత్వం వహించాడు.












