Varanasi: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా వారణాసి. తాజాగా, ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అది, కూడా వారణాసి సినిమాకి సంగీతం అందిస్తున్న ఎం.ఎం.కీరవాణి నుంచి రావడం విశేషం. కొన్నేళ్ళ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, అసలు ఈ కాంబినేషన్ ని ఊహించుకోవడమే కష్టమన్నారు.
ఎట్టకేలకి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను ప్రకటించి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ సినిమా కథ ఎలా ఉంటుంది..మహేష్ రోల్ ఎలా ఉంటుంది..అంటూ ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ. గ్లోబ్ ట్రాటర్ అంటూ చేసిన గ్రాండ్ ఈవెంట్ లో మహేష్ లుక్ రివీల్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. ఇది, పాన్ వరల్డ్ సినిమా అని ఊహకందనతగా అంచనాలను పెంచాడు రాజమౌళి.
అయితే, ఈ సినిమాకి సంబందించి ఈ మధ్య ఎలాంటి అప్‌డేట్ రావడం లేదని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ సెప్టెంబర్ నుంచి నేపథ్య సంగీతానికి సంబందించిన వర్క్ స్టార్ట్ చేసి జనవరి 2027 వరకూ పూర్తి చేయబోతున్నట్టుగా తెలిపాడు. ఏప్రిల్ 7, 2027 న సినిమా 120 దేశాలలో 20 భాషలలో రిలీజ్ చేయనున్నట్టుగా ఆల్రెడీ రాజమౌళి ప్రకటించాడు. ఇప్పుడు, ఈ డేట్ ని కీరవాణి డబుల్ కన్‌ఫర్మ్ చేశాడు.
దీంతో, ఇకపై వారణాసి సినిమా నుంచి వరుసగా అప్‌డేట్స్ రాబోతున్నాయని మహేష్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించబోతోంది. మహేష్..రుద్ర, శ్రీరాముడిగా రెండు రకాల పాత్రల్లో అలరించబోతున్నాడు. కన్నడ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకూ రాజమౌళి తీసిన సినిమాలకంటే అత్యంత భారీ స్థాయిలో వారణాసి రాబోతోంది.












