క్రైమ్

Student Shivani: సీఎం చంద్రబాబుతో ప్రశంసలు అందుకున్న టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. చంద్రబాబు కీలక ఆదేశాలు

రచన: NK5 నిమిషాల పఠనం

పోలవరం జిల్లా రంపచోడవరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టెన్త్ విద్యార్థిని ముర్రం శివానీ ఆత్మహత్య చేసుకుంది. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది శివానీ. పోలవరం జిల్లా ఇర్లపల్లిలో తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. ఇటీవల 24వ తేదీన పంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సమక్షంలో శివానీ మాట్లాడింది.

Student Shivani: పోలవరం జిల్లా రంపచోడవరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టెన్త్ విద్యార్థిని ముర్రం శివానీ ఆత్మహత్య చేసుకుంది. రంపచోడవరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది శివానీ. పోలవరం జిల్లా ఇర్లపల్లిలో తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది.

ఇటీవల 24వ తేదీన పంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సమక్షంలో శివానీ మాట్లాడింది. తన ప్రసంగంతో సీఎం చంద్రబాబును మెప్పించింది శివానీ. విద్యార్థిని స్పీచ్ కు ఫిదా అయ్యారు చంద్రబాబు. ఆ అమ్మాయిని పిలిచి మరీ తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు. ప్రత్యేకంగా అభినందించారు కూడా.

శివానీ అనుభవిస్తున్న బాధ ఏంటి?

ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రశంసలు అందుకున్న అమ్మాయి ఇప్పుడిలా సడెన్ గా సూసైడ్ చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. సహచర విద్యార్థులు, టీచర్లు నమ్మలేకపోతున్నారు. చనిపోయే మందు శివాని సూసైడ్ లెటర్ రాసింది. తాను చాలా బాధను అనుభవిస్తున్నానని అందులో రాసింది. అయితే ఆ బాధ ఏంటి అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. మీ కలలను నెరవేర్చలేకపోతున్నా అమ్మా నాన్న నన్ను క్షమించండి అని అందులో రాసింది.

అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్న శివానీ..

శివానీ తల్లిదండ్రులు కోరుకొండలో ఓ హోటల్ లో పని చేస్తున్నారు. శివానీ మాత్రం తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. శివానీ బాగా చదువుకునేదని టీచర్లు చెప్పారు. అలాంటి అమ్మాయి ఇలా చేయడం నమ్మలేకపోతున్నామన్నారు.

శివానీ మృతి పట్ల చంద్రబాబు విచారం..

శివానీ మరణంపై చంద్రబాబు స్పందించారు. శివానీ మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. శివానీ ఇలా తనువు చాలించడం తనను తీవ్ర విషాదంలోకి నెట్టివేసిందన్నారు. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన అమ్మాయి ఇలా బలవన్మరణానికి పాల్పడటం ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆరోజు తన చదువు గురించి, ఉన్నత లక్ష్యాల గురించి శివానీ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయన్నారు.

కష్టాలు, సమస్యలకు కుంగిపోవద్దు..

ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరం అన్నారు. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే విద్యార్థిని తనువు చాలించడం కలిచి వేస్తోందన్నారు. శివాని మృతిపై సమగ్ర దర్యాఫ్తు జరపాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా కుంగిపోకుండా విద్యార్థులు, యువత ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు సీఎం చంద్రబాబు.

ఒత్తిడిని జయించి కలలను నిజం చేసుకోవాలి..

ఒత్తిడి, నిరాశ నిస్పృహలకు లోను కావొద్దని పిలుపునిచ్చారు. సమస్య ఎంత పెద్దది అయినా దానికి కచ్చితంగా పరిష్కారం ఉంటుందన్నారు. మీ బాధ, ఆవేదనను కుటుంబసభ్యులతో కానీ స్నేహితులతో కానీ పంచుకోవాలని విద్యార్థులకు సూచించారు చంద్రబాబు. ఒత్తిడిని అధిగమించి కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

విద్యార్థిని మృతదేహాన్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

#Polavaram#Student Shivani#Ends Life#Rampachodavaram#Murram Shivani#Cm Chandrababu#Tenth Class Student#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి