విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన దశ పరీక్షలు. కానీ ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలు, నకిలీ అభ్యర్థులు, సాంకేతిక మోసాలు వంటి ఘటనలు చోటుచేసుకుంటే.. కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు అన్యాయానికి గురవుతుంది. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టానికి సవరణలు తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా 2024 నాటి ప్రవేశ పరీక్షలు చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది కాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ చట్ట సవరణకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
విపక్షాల ఆందోళనల నడుమ ఈ బిల్లు సభ ముందుకు వచ్చింది. నీట్ సహా పలు పరీక్షల పేపర్లు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దాంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
మరోవైపు నీట్ సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పై కూడా రాజకీయ ఒత్తిడి పెరిగింది.
ఇక ఈ బిల్లు అమల్లోకి వస్తే.. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షా ప్రక్రియలో మోసాలు, అక్రమ సహాయం, నకిలీ గుర్తింపులతో పరీక్షలు రాయడం వంటి అక్రమాలను కట్టడి చేయడానికి మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పరీక్షా కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు సహకరించే వ్యక్తులు పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతం కావచ్చు..
మరోవైపు.. దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం మరో కీలక చర్య చేపట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో సంస్కరణలు తీసుకురావడంతో పాటు.. పరీక్షల నిర్వహణలో భద్రత, పారదర్శకత పెంచేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఏమాత్రం అవకాశం లేకుండా.. పరీక్షల నిర్వహణలో అత్యాధునిక, అత్యంత సురక్షితమైన విధానాలను పరిశీలించనుంది.
ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశను సమీక్షించి.. పరీక్షా వ్యవస్థలో లోపాలను గుర్తించడంతో పాటు అవసరమైన సంస్కరణలపై ఈ టాస్క్‌ఫోర్స్ కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. మొత్తంగా.. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా, మరింత విశ్వసనీయమైన వ్యవస్థను రూపొందించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.












