వైరల్ న్యూస్

Techie : నెలకు రూ.2 లక్షల జీతం..నేనూ పేదవాడినే అంటున్న టెకీ

రచన: Kumar4 నిమిషాల పఠనం

డబ్బు ఎంత ఉన్నా ఓ సామాన్యుడికి ఆనందాన్ని మాత్రం పంచలేకపోతున్నది. కారణం ద్రవ్యోల్బణం, లివింగ్ కాస్ట్..పల్లెల్లో పనులు లేక చాలా మంది పట్టణాల బాట పడుతున్నారు.ఊర్లలో సొంత ఇండ్లు ఉంటాయి. అక్కడ రూ.10వేలు వచ్చినా హ్యాపీగా బతికేయొచ్చు.

డబ్బు ఎంత ఉన్నా ఓ సామాన్యుడికి ఆనందాన్ని మాత్రం పంచలేకపోతున్నది. కారణం ద్రవ్యోల్బణం, లివింగ్ కాస్ట్..పల్లెల్లో పనులు లేక చాలా మంది పట్టణాల బాట పడుతున్నారు.ఊర్లలో సొంత ఇండ్లు ఉంటాయి. అక్కడ రూ.10వేలు వచ్చినా హ్యాపీగా బతికేయొచ్చు. కానీ, కొందరు అప్పుల భారం, ఉపాధి లేక పట్టణాలకు వచ్చి బతకీడుస్తున్నారు. ఇక్కడ వారికి డబ్బులు బాగానే వస్తున్నా..ఖర్చులకు సరిపోవడం లేదు. సంపాదించిన డబ్బులు అద్దెలు, ఈఎంఐలు, ఆరోగ్యం, ఖర్చులకే సరిపోతున్నాయి.

తాజాగా ఓ టెకీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరినీ ఆలోచనలో పడేసింది. నెలకు దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ, ఎలాంటి అప్పులు (ఈఎంఐలు) లేకపోయినప్పటికీ తాను ఒక పేదవాడిలాగే ఫీల్ అవుతున్నానని వాపోయాడు. బెంగళూరుకు చెందిన సదరు సాఫ్ట్‌వేర్ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగళూరులో పెరిగిన జీవన వ్యయం, అలాగే ఒక సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే కోరిక తనను నిరంతరం తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ టెకీ పోస్ట్ వైరల్ అవ్వడంతో మెట్రో నగరాల్లో జీవించే ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక,మానసిక పరిస్థితులపై చర్చ ప్రారంభించారు. ఇంటి అద్దెలు, నిత్యావసరాల ధరలు, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు ఆకాశాన్ని తాకుతుండటంతో రూ. లక్షల్లో జీతాలు అందుకుంటున్న ఐటీ ఉద్యోగులు కూడా పొదుపు చేయలేకపోతున్నారని, తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్యాకేజీలు బాగానే ఉన్నా నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్, ఖర్చుల వలన ఉద్యోగుల్లో సేవింగ్స్ తగ్గిపోతున్నాయని, భవిష్యత్‌పై భయాలను మరింత పెంచుతోందని అభిప్రాయపడుతున్నారు. జబ్బు పడితే ఆస్పత్రుల్లో బిల్లు తడిచిమోపెడు అవుతోందని, అందుకోసం మళ్లీ లోన్లు పెట్టాల్సి వస్తుందని,ఆ ఈఎంఐలు కట్టలేకపోతున్నట్టు ఆవేదన చెందుతున్నారు.

#Software enjineer#2lac package#feel like poor#social media#Banglore
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి