ఈ దేశంలో మతం మారితే షెడ్యూల్ కులాలు ఎస్సీ, ఎస్టీ హోదా కోల్పోతారని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి పునరుద్ఘాటించింది. మతం మార్చుకుంటే ఎస్సీ హోదా కోల్పోతారని, గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది.క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు తప్ప ఇతర మతాలకు మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోకి వస్తేనే ఎస్సీ హోదా పొందవచ్చని తెలిపింది.
షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అట్రాసిటీ కేసు చెల్లదని మే నెలలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పగా.. తాజాగా ఆ తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించడం రెండోసారి. హోదా కోసం మతం మారిన వ్యక్తికి ఎస్సీ కార్డు వర్తించదని గతంలోనూ సుప్రీంకోర్టు తెలిపింది. బీసీ హోదా కోసమే ఇతర మతాల్లోకి వెళితే.. అందులో కులాలు ఉండవని.. అప్పుడు ఎస్సీ హోదా ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. కేవలం హిందూ ధర్మంలో మాత్రమే కులాలు ఉన్నాయని.. మిగతా మతాల్లో కులాలు లేవని, రాజ్యాంగం ప్రకారం ఆ మతాల్లో ఎస్సీ హోదా ఉండదని పేర్కొంది.అయితే, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి చర్చి పాస్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
https://x.com/TeluguScribe/status/2081631266768851197?s=20
చర్చి నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కల రామిరెడ్డి మరికొంత మందిపై చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టగా..ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అక్కల రామిరెడ్డి, ఇతరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందువు కాజాలడని, అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని తీర్పునిచ్చింది. దీనిని చింతాడ ఆనంద్ సుప్రీంలో సవాల్ చేయగా.. ఏపీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.












