అధికార కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఏమాత్రం ఆగడం లేదు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్సెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి.ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పాలిటిక్స్ నడుస్తున్నాయి.రెండ్రోజుల కింద కోమటిరెడ్డి బద్రర్స్‌కు సైతం మందుల సామేల్ వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో తలదూర్చకూడదని బహిరంగంగానే మీడియా ముఖంగా హెచ్చరికలు పంపారు.
ఆ మధ్య తుంగతుర్తి నియోజకవర్గంలో నూతన మండల కమిటీలకు అధ్యక్షుల నియామకం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్లు అసహనం వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ బయలుదేరగా..సామేల్ అనుచరులు అడ్డుకుని దాడులకు పాల్పడినట్టు ఆ మధ్య విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. హైమాండ్ జోక్యంతో ఈ మధ్యే వివాదం కాస్త సర్దుమనిగింది.
https://x.com/TeluguScribe/status/2081431419562434846?s=20
తాజాగా మరోసారి వివాదం చెలరేగింది. ‘మందుల సామేల్ అనుచరులు మమ్మల్ని చంపాలని చూశారు’ అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడు ఒకరు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘తుంగతుర్తిలో మందుల సామేల్ అరాచకాలపై ప్రెస్ మీట్ పెడితే బయటకు లాగి మమ్మల్ని కొట్టారు.తుంగతుర్తిలో ఎంపీ చామల అనుచరులను లేకుండా చేయాలని చూస్తున్నారు.అధిష్టానం మందుల సామేల్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని’ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.












