King 100: అక్కినేని నాగార్జున నటిస్తున్న కింగ్ 100 సినిమాకి సంబందించిన ఏ అప్‌డేట్ రావడం లేదని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. నాగ్ కొడుకులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ తమ సినిమాలతో హిట్ అందుకున్నారు. కానీ, నాగార్జున మాత్రం ఇటీవల కాలంలో ఒక్క హిట్ కూడా చూడలేదని చెప్పుకుంటున్నారు.
ఆగస్టులో నాగ్ బర్త్ డే..
అయితే, ఆగస్టు నెలలో నాగార్జున పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో ఆయన నటిస్తున్న తన 100వ సినిమా నుంచి టైటిల్ టీజర్ తో పాటు నాగ్ లుక్ ని రివీల్ చేయడానికి దర్శకుడు రా.కార్తీక్ రెడీ అవుతున్నాడట. ఇప్పటికే, టీజర్ కట్ రెడీ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ్ పలు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తాడని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది.
కథ, పాత్ర నచ్చితే నాగార్జున ఎలా కావాలంటే అలా మేకోవర్ అవుతాడనే విషయం అందరికీ తెలీందే. గీతాంజలి సినిమాలో ఓ గెటప్..నిన్నే పెళ్ళాడతా సినిమాలో మరో గెటప్..ఇలా నాగార్జున ఎంత టైలిష్ గా సినిమా సినిమాకి కనిపిస్తున్నాడో చూశాము. ఇప్పుడు, తన 100వ సినిమా కోసం రక రకాల గెటప్పులలో అలరించబోతున్నాడట.
దసరా నుంచి కింగ్ తప్పుకున్నాడా?
అయితే, నాగార్జున నటిస్తున్న ఈ లేటెస్ట్ సినిమా దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని ముందు మేకర్స్ భావించారు. కానీ, పలు కారణాల వల్ల అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం లేదట. ఈ ఏడాది డిసెంబర్ లేదా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నాగ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాగ్ బర్త్ డే రోజునే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ క్లారిటీ రానుందని సమాచారం.












