తెలంగాణ

TG IPass : టీజీ ఐపాస్‌లో లెక్కలు మాయం? ఏం జరిగింది?

రచన: Kumar3 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వంలో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు సరిగా పనిచేయడం లేదని తెలపడానికి టీజీ ఐపాస్ వైబ్‌సైట్‌ను ఉదాహరణగా తీసుకోవచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వంలో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు సరిగా పనిచేయడం లేదని తెలపడానికి టీజీ ఐపాస్ వైబ్‌సైట్‌ను ఉదాహరణగా తీసుకోవచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత 8 నెలలుగా వైబ్‌సైట్‌లో ఎటువంటి వివరాలు అందులో కనిపింంచడం లేదని తెలుస్తున్నది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమా?లేక ప్రభుత్వ జోక్యంతో ఇది జరిగిందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, వాటి వివరాలు.. ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులను ఆమోదించింది. ఎంతమందికి ఉపాధి కల్పించారు? వంటి వివరాలు టీజీ ఐపాస్ వెబ్‌సైట్లో దర్శనమివ్వడం లేదు. ఇటువంటి కీలక అంశాలను పారదర్శకంగా అందించాల్సిన టీజీ–ఐపాస్.. అసలు వివరాలు వెబ్‌సైట్‌లో గత ఎనిమిది నెలలుగా కనిపించకుండా పోతే అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రతిపక్షాలు, సామాన్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2081590243669442820?s=20

గత ఏడాది నవంబర్‌లో హిల్ట్ పాలసీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టడంతో..అప్పటి నుంచే వెబ్‌సైట్‌లో ఈ వివరాలు కనిపించడం లేదని, ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు తెలిసిపోతాయనే ఉద్దేశంతోనే వెబ్‌సైట్ నుంచి లెక్కలను తొలగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గులాబీ నేతలు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న సర్కార్.. వాటి వివరాలు ఎందుకు వెబ్‌సైట్ పొందు పరచలేదని, నిజానికి పెట్టుబడులు వచ్చాయా? ఎన్ని కంపెనీలు గ్రౌండింగ్ అయ్యాయి అనే వివరాలు టీజీ ఐపాస్‌లో చూపించకపోవడంతో అదంతా ఉత్తదేనా? సీఎం రేవంత్ కావాలనే షో చేశారా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#TG Ipass#website#No information#past 8 months#Telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి