సినిమా

NBK 112: బాలయ్య లేకుండానే షూటింగ్ స్టార్ట్?

రచన: Anshu4 నిమిషాల పఠనం

NBK 112: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. వాటిలో ఒకటి ఆయన 111వ సినిమా. దీనికి, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం, కాకినాడ పోర్ట్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే, యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కిస్తున్న సమయంలో బాలయ్యకి గాయాలయ్యాయి. దీంతో, హుటాహిటిన బాలయ్యను హైదరాబాద్ షిఫ్ట్ చేశారు.

చిన్నపాటి సర్జరీ జరిగింది. ఇప్పుడు, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే బాలయ్య సెట్స్ లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. గతంలో, బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు, వీరి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా. దీనిపై, ఆల్రెడీ అంచనాలు బాగానే మొదలయ్యాయి.

ఇక, ఎన్‌బికే 112 కూడా ఇటీవలే పూజా కార్యక్రమాలలో ఘనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే, "కార్పెంటర్" అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాను ఆగస్టు నుంచి సెట్స్‌పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ లాంగ్ షెడ్యూల్ ని కొరటాల శివ ప్లాన్ చేశాడు. అయితే, అనుకోకుండా బాలయ్యకి సర్జరి జరగడంతో..అదే షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేయకుండా మొదలుపెట్టాలని చూస్తున్నారట.

బాలయ్య లేకుండానే కొరటాల శివ కీలకమైన సన్నివేశాలను షూట్ చేసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. గత చిత్రాలు దేవర, ఆచార్య కొరటాలను బాగా డిసప్పాయింట్ చేశాయి. దీంతో, ఎన్‌బికే 112 తో సాలీడ్ హిట్ కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని కసితో బాలయ్యకి తగ్గ స్క్రిప్ట్ రెడీ చేసినట్టుగా ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. చూడాలి, మరి కొరటాల-బాలయ్య కాంబోలో వచ్చే ఈ సినిమా ఎలాంటి హిస్టరీని క్రియేట్ చేస్తుందో.

#nbk111#nbk112#gopichandmalineni#koratalasiva
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి