Ramayana: మన సౌత్ సినిమాలలో నటించిన హీరోయిన్స్ కన్ను, ఆ తర్వాత పడేది బాలీవుడ్ మీదే. అక్కడ ఒక్క సినిమా చేస్తే వచ్చే రెమ్యునరేషన్..సౌత్ లో మూడు సినిమాలు చేస్తే ఇస్తారనేది లోగుట్టు. అదీకాక, ఒక్క హిందీ సినిమా హిట్ అయితే, ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వస్తుందనేది.. మన సౌత్ బ్యూటీస్ కి ఉన్న ఆలోచన. అయితే, అది ఒకప్పుడు. ఇప్పుడు మన తెలుగు సినిమానే కాకుండా మిగతా సౌత్ భాషల సినిమాలకి పాన్ ఇండియా వైడ్‌గా గుర్తింపు లభించింది.
కాబట్టి, ఇప్పుడు భాష కాదు ముఖ్యం. కథ..అందులో పాత్ర. అందుకే, సాయి పల్లవి ఇంతకాలం సౌత్ లో సినిమాలు చేసింది. ఒక్కసారిగా బాలీవుడ్ లో అవకాశం వస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది, కూడా మైథలాజికల్ మూవీ రామాయణ సిరీస్ లో. ఇందులో ఆమె పోషిస్తున్న పాత్ర సాక్షాత్తూ సీతాదేవి. విచిత్రం ఏమిటంటే ఒకవైపు రామాయణ లాంటి భక్తి ప్రధానమైన సినిమాలో సీత పాత్రను చేస్తూనే, ఏక్ దిన్ అనే రొమాంటిక్ మూవీ చేయడం.
ఇదిలా ఉంచితే, ఇప్పుడు సాయి పల్లవి రెమ్యునరేషన్ గురించి అంతటా హాట్ టాపిక్ అవుతోంది. దీనికి, కారణం రామాయణ సినిమా కోసం ఆమె అందుకున్న రెమ్యునరేషన్ ఏకంగా రూ.20 కోట్లట. ఒకరకంగా చెప్పాలంటే ఇదేమీ పెద్ద షాకవ్వాల్సిన రెమ్యునరేషన్ కాదు. ఎందుకంటే, రామాయణ అనేది కంప్లీట్ గా భక్తి ప్రధానంగా సాగే కథ. ఇందులో, సాయి పల్లవి పాత్ర సీతాదేవి.
అయితే, రామాయణ రెండు భాగాలుగా వస్తోంది కాబట్టి, 20 కోట్లు రెమ్యునరేషన్ అనేది పెద్ద మొత్తమేమీ కాదు. కమర్షియల్ సినిమాకే క్రేజ్ ఉన్న హీరోయిన్‌కి గ్లోబల్ మూవీ కోసం ఈ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అలాంటిది, రెండు భాగాలకి కలిపి 20 కోట్లు అంటే తక్కువే. కానీ, సాయి పల్లవి హిందీలో ఒప్పుకున్న మొదటి సినిమా కాబట్టి, ఇంత తక్కువకి కమిటైందని చెప్పుకుంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే..సాయి పల్లవికి మనసుకు నచ్చిన పాత్ర వస్తే రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించదనే మాట ఉంది. కాబట్టే, రామాయణ రెండు భాగాలకి 20 కోట్లకే సైన్ చేసిందంటున్నారు. ఇందులో, అసలు వాస్తవం ఏంటనేది ఒక్క సాయి పల్లవికే తెలుసు.












