కేసులతో ఒరిగింది ఏంటి?
లాబీయింగ్స్ తోనే అన్ని పనులు?
ఈజీఎం మీటింగ్‌లో కఠిన నిర్ణయాలు!
విషయాలు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు
సీజీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకొని చెబుతారా?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809
రిచ్చెస్ట్ ఏరియా జూబ్లీహిల్స్ క్లబ్‌కు సంబంధించి స్వేచ్ఛ న్యూస్ ఇచ్చిన కథనం సంచలనం రేపింది. మీడియా సంస్థలు వాళ్ల సొంత చేతిలో ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి. చేసిన తప్పులు సోషల్ మీడియాలోనే ఊరు పేరు లేకుండా చెబుతూ పబ్బం గడుపుతున్నారు. హైదరాబాద్‌లో క్లబ్‌ల పేరుతో డబ్బులను దోచుకుని గబ్బుగా మార్చుతున్న తీరుపై దమ్మున్న స్వేచ్ఛ న్యూస్ పార్ట్ -1గా కథనం ఇచ్చింది. ఈ కథనం స్థానికంగా కలవరం రేపింది. కౌంటర్ అఫిడవిట్స్ రూపంలో సమాధానాలు చెప్పుకునేలా ప్రయత్నం చేసుకుంటున్నారు. లిఖితపూర్వకంగా కూడా అధికారికంగా చెప్పుకోలేని పరిస్థితి కొంత మందికి తయారైంది.
ఫోర్జరీ చేసింది ఎవరో తెలుస్తుంది
పాత సెక్రెటరీ చేసిన అక్రమ నిర్మాణాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. అంతా దోచుకునేలా ప్రయత్నం చేసినట్లు కళ్ల ముందే కనిపిస్తోంది. కానీ ఫోర్జరీ సంతకాలతో చేసినా ఎలక్షన్స్ తీరుపై వివరణ ఇచ్చారు. ఈ దోబూచులాటపై పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు. సోసైటీ, క్లబ్ గొడవ మొత్తం స్టేట్ ఇష్యూలా చేసుకుని అధికారులకు ప్రెజర్ తేవడంతో వీళ్ల చిల్లర గొడవతో ఏగలేమని అత్యున్నత అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నెక్ట్స్ క్లబ్ స్టోరీ..
అసెంబ్లీకి దగ్గరగా ఉండే ఈ క్లబ్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సొమ్మును సొంతం చేసుకుంటున్నారని టాక్. ఎవరెవరు ఎలా ఏం చేశారో మరో కథనంలో డీటెల్డ్‌గా చూద్దాం.












