రాజకీయాలు

రెవెన్యూ దోపిడీపై జెన్ జీ యుద్ధం మొదలవ్వాలి

రచన: Venu8 నిమిషాల పఠనం

బ్రిటీష్ పాలనకు దూరంగా ఉన్నా, నిజాం న్యాయ వ్యవస్థలో ఆస్తుల గురించి చాలా క్లియర్‌గా ఉండేది. ఆనాటి భూముల సర్వేలే ఇప్పటికీ వాడుతున్నాం. ఆనాటి వ్యవస్థ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఏదీ సరిగ్గా లేదు.

- ఢిల్లీ వేదికగా బొద్దింకల సత్తా తెలిసింది

- తెలంగాణ భూ దోపిడీపైనా అలాంటి యుద్ధమే జరిగితే దోపిడీదారులకు చరమగీతం పాడొచ్చు

- జెన్ జీలను చూసి మనం కూడా అసమానతలు ఏంటో నేర్చుకోవాలి

- తెలంగాణలో లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కేసుల్లో అంతటా నిర్లక్ష్యమే

- న్యాయ వ్యవస్థల తీరుతో సన్నగిల్లుతున్న ఆశలు?

- ప్రభుత్వ భూములపై న్యాయవాదులకు లేని ప్రేమ

- న్యాయ శాఖలో అవినీతి ఎన్నో కేసుల్లో బట్టబయలు?

- కూకట్ పల్లి ఐడీఎల్ భూముల కేసు లిస్టులోకి కూడా రానివ్వని వైనం?

- ప్రభుత్వం నుంచి వివరాలు ఇవ్వాలంటే.. ఎవరి కోసం ఈ తతంగం?

- ఆనాడే ఐడీఎల్ వాళ్లు భూములకు డబ్బులు చెల్లిస్తే..

- కలెక్టర్‌గా హరీష్ రెడ్డి 2021లో ఎకరం వెయ్యికి ఎలా ఇచ్చారు?

- అన్నీ జరిగాక అమోయ్ కుమార్ 2023లో 333 ఎకరాలకు ఎలా క్లియరెన్స్ ఇస్తారు?

- ఇవన్నీ బయటపడితే హిందుజాతో పాటు ఫినిక్స్, హానర్ హోమ్స్ బినామీ భూ భాగోతాలు బట్టబయలేనా?

- ఆ ప్రభుత్వ భూమి విలువ రూ.50 వేల కోట్లకు పైనే.. న్యాయం ఎప్పుడు?

- అర్థిక అసమానతలకు అసలు కారణం ఇలాంటి స్కాములు కాదా?

- స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్

9848070809

దోమలు, బొంద్దికలు ఎప్పుడూ చావవు

నిరుద్యోగులను కాక్రోచ్‌లుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పొల్చినందుకే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. జెన్ జీ తరం దీనికి మద్దతు తెలుపుతోంది. సోషల్ మీడియా విప్లవంతో దశబ్దాల తర్వాత దేశ రాజకీయ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒక్క ఉద్యమం ఎన్ని పార్టీలనైనా పుట్టిస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. నీట్ విషయంలో జెన్ జీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. అలాంటి యుద్ధం భూముల దోపిడీపైనా జరిగితే బాగుంటుందనే అభిప్రాయం తెలంగాణలో వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆర్థిక అసమానతలు. జీవితం మొత్తం కష్టపడినా గుంట భూమి కోనలేని ఉద్యోగులు ఉన్న రాష్ట్రంలో, ఏం చేయకపోయినా పదుల సంఖ్యలో కంపెనీలకు డైరెక్టర్‌గా మారి, వారు స్థాపించిన కంపెనీలతో వేల కోట్ల వ్యాపారం చేస్తున్న వారు చాలామందే ఉన్నారు. పేదల, ప్రభుత్వ భూములను ఆనాడు భూస్వాములు దోచేస్తే, ఈనాడు రియల్టర్స్ వ్యాపారులు నాయకులతో కలిసి నిత్యం పేదల రక్తం, ప్రభుత్వ ఆస్తులను పీల్చుకుని దోమల లాంటి వ్యవస్థను పెంచిపోసిస్తున్నారు. ఈ దోమల వ్యవస్థను కాపాడుకునేందుకు డ్రైనేజ్‌లా అన్ని వ్యవస్థలను డబ్బుల రూపంలో ఇచ్చి పాడు చేస్తున్నారు. డ్రైనేజీలో ఉండే బొద్దింకలు రాత్రి పూటనే ఇళ్లలోకి వచ్చి చెడు పదార్ధాలను తిని బతికేస్తున్న వారితో పొల్చినప్పుడే కాక్రోచ్ ఉద్యమం మొదలైంది. అది జెన్ జీ రూపంలో ఆదర్శంగా మారింది.

హైదరాబాద్ న్యాయ వ్యవస్థ?

బ్రిటీష్ పాలనకు దూరంగా ఉన్నా, నిజాం న్యాయ వ్యవస్థలో ఆస్తుల గురించి చాలా క్లియర్‌గా ఉండేది. ఆనాటి భూముల సర్వేలే ఇప్పటికీ వాడుతున్నాం. ఆనాటి వ్యవస్థ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఏదీ సరిగ్గా లేదు. ఆనాటి నిజాం రికార్డులను సైతం మాయం చేసి మారుస్తామనే ఆంధ్రావాళ్లతో తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీ కూడా చేయి కలిపి హైదరాబాద్ భూములను దోచుకుంది. ఒకప్పుడు ఇతియాస్ కోర్టులు ఉండేవి. ఇప్పుడు న్యాయ స్థానాల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో బాధితులు, సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు.

కూకట్ పల్లి భూ స్కాం ఎందుకు లిస్ట్ కాలేదు?

హైకోర్టులో ఏదైనా నెక్ట్స్ హియరింగ్ అని చెబితే ఆనాడు లాస్ట్ కైనా కాజ్ లిస్ట్‌లో పెడతారు. కానీ ఓ డేట్ ఇచ్చి లంచ్ తర్వాత వింటామని వీడియో రికార్డ్స్ సాక్షిగా చెప్పినట్లు జస్టిస్‌లు నడుచుకోవడం లేదు. గత వారం రావాల్సిన కేసు ఆ తేదీన లిస్ట్ కాలేదు. ఎందుకో ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్లనే అడగాలి. ఈ కేసు విచారణతో ప్రభుత్వానికి ఎంత మేలు జరుగుతుందో వివరించే సత్తా ఫైట్ చేసే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కానీ మూడు సిస్టమ్స్ మేము చెప్పినట్లే నడుస్తాయి, ఫోర్త్ ఎస్టేట్ కి టేస్టే ఉండదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై జెన్ జీలా తిరగబడాలి. తప్పకుండా నిలదీయాలి. 2008 కేబినెట్ నిర్ణయంతో 2020లో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? 2021లో హరీష్ రెడ్డి కూకట్ పల్లిలో ఎకరం భూమిని వెయ్యి రూపాయలకు ఇస్తే చాలు అన్నారు. ఆ తర్వాత కళ్లు తెరిచి తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు 2023లో అవినీతి అమోయ్ కుమార్‌తో 333 ఎకరాలను క్లియర్ చేయించుకున్నారు. వీటన్నింటిపై హైకోర్టు విచారణలో ప్రభుత్వం, భూములు అమ్మిన హిందుజా, కొనుగోలు చేసిన ఫినిక్స్ సిస్టర్ సంస్థలు మరెన్నో బినామీలు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇలాంటి భూ పోరాటాలపై జెన్ జీ మాదిరి తిరగబడి పోరాటం చేయాలి.

ప్రశ్నిస్తే దారికి రావాల్సిందే?

20 ఏండ్ల క్రితం మీడియా ప్రతినిధులు అడిగితేనే ప్రశ్నించేది. ఇప్పుడు ప్రతి వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. కొంత మందికి ఉప్పు అందిస్తే విషయాన్ని విశ్వం మొత్తం వ్యాప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాంటి వారు జెన్ జీ మాదిరి తెలంగాణలో భూ దోపిడీపై తిరగబడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.

#Telangana#Gen Z#must launch#against revenue#exploitation#kukatpalli
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి