International

ఆయుధాల్లేవ్.. ఇరాన్ ముందు చేతులెత్తేసిన ట్రంప్..? అమెరికాకు షాకిచ్చిన పెంటగాన్ హెచ్చరికలు!

రచన: Kashi7 నిమిషాల పఠనం

ఇరాన్‌పై పెద్ద స్థాయి యుద్ధ చర్యలు చేపట్టడం ఇప్ప‌టికీ సాధ్యమేనని అమెరికా సైనికాధికారులు చెబుతున్నారు. కానీ అలా చేస్తే పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతాయని హెచ్చ‌రిస్తున్నారు. ఇది దీర్ఘ‌కాలంలో తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఈ నేప‌థ్యంలోనే ట్రంప్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది.

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ఉక్కిరిబిక్కిరి

ఆయుధాలు ఖాళీ.. చేతులెత్తేసిన అమెరికా

ఉన్న‌ట్టుండి.. వెన‌క్కి త‌గ్గిన డొనాల్డ్ ట్రంప్

టెహ్రాన్ దెబ్బ మామూలుగా లేదుగా..!

నేను చిటికేస్తే.. ఇరాన్ ముక్క‌లు ముక్క‌ల‌వుతుంది. ఆ దేశాన్ని నామ రూపాలు లేకుండా చేసేస్తా. వింటారా.. లేక చ‌స్తారా..? ఇవీ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రిక‌లు. ఏమైందో ఏమో కానీ.. ఉన్న‌ట్టుండి సైలెంటైపోయారు ట్రంప్. ఇరాన్ అంతు చూస్తానంటూ అంతెత్తు లేచిన అమెరికా అధ్య‌క్షుడు.. ఇప్పుడు దాదాపుగా యూ ట‌ర్న్ తీసుకున్నారు. అందుకే ఇరాన్‌లో ప్ర‌స్తుతం ఒక‌లాంటి నిశ్శ‌బ్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ట్రంప్‌లో ఎందుకు ఈ స్థాయి మార్పు వ‌చ్చింది..?

ఆయుధాల‌న్నీ ఖ‌త‌మ్...

అమెరికా ఆయుధాగారం ఖాళీ అయింద‌ని చెప్ప‌లేం కానీ.. ఇలానే యుద్ధం చేస్తూ పోతే మొత్తం ఖాళీ అవుతుంద‌ని ఉన్న‌తాధికారులు ట్రంప్‌కు తేల్చిచెప్పార‌ట‌. పెంటగాన్ వద్ద ఉన్న వాయు రక్షణ ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతాయని వార్నింగ్ ఇచ్చార‌ట‌. అందుకే ట్రంప్ ఒక్క‌సారిగా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. దాడుల‌ను ఆపేయ‌మ‌ని అన‌ధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. భారీ దాడికి అమెరికా సైన్యం సిద్ధ‌మ‌వుతున్న వేళ అనూహ్యంగా ఈ ప‌రిణామం చోటు చేసుకుంది.

రెండ్రోజుల కింద‌ట ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు, సీనియర్ సలహాదారులతో ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో అమెరికా సైన్యం వద్ద పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయన్న అంశమే ప్రధానంగా చర్చకు వచ్చిందట‌. ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత పెంచాలన్న అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్న సమయంలో అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ అధ్య‌క్షుడి దృష్టికి తెచ్చార‌ని న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం పేర్కొంది. అందుకే ట్రంప్ సైలెంట‌య్యార‌న్న‌ది ఆ క‌థ‌నం సారాంశం.

యుద్ధం తెచ్చిన సంక్షోభం

ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు సంక్షోభాన్ని తెచ్చింద‌ని ఆ దేశంలోని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ మొండిగా ముందుకెళ్ల‌డంతోనే ఈ స‌మ‌స్య అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిన్న మొన్న‌టి దాకా వీటిని ప‌ట్టించుకోని ట్రంప్.. ఇప్పుడు ఆలోచ‌న‌లో ప‌డ్డార‌నే వార్త‌లొస్తున్నాయి. పశ్చిమాసియాలో పెద్ద యుద్ధం చెలరేగడం, గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇంధన సరఫరా అంతరాయం, శరణార్థుల సంక్షోభం మరింత పెరగడం వంటి అంశాలపై ట్రంప్, ఆయన సలహాదారులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌పై పెద్ద స్థాయి యుద్ధ చర్యలు చేపట్టడం ఇప్ప‌టికీ సాధ్యమేనని అమెరికా సైనికాధికారులు చెబుతున్నారు. కానీ అలా చేస్తే పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతాయని హెచ్చ‌రిస్తున్నారు. ఇది దీర్ఘ‌కాలంలో తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఈ నేప‌థ్యంలోనే ట్రంప్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది.

యుద్ధం ఆగిపోయిన‌ట్టేనా..?

ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ఎవ‌రూ ఊహించ‌లేరు. ఆయుధాల‌న్నీ అయిపోతున్నాయ‌ని హెచ్చ‌రిక‌లు వ‌చ్చినా.. డోంట్ కేర్ అన‌వ‌చ్చు. అందుకే యుద్ధం ఆగిపోయింద‌ని ఊహించ‌డం పొర‌పాటే అవుతుంది. కాక‌పోతే.. ఈసారి హెచ్చ‌రిక‌లు అత్యున్న‌త స్థాయి నుంచి రావ‌డంతో అమెరికా అధ్య‌క్షుడు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. మ‌రి మిడిల్ ఈస్ట్ వార్‌లో ఈ విరామం ఇలాగే కొన‌సాగుతుందా.. లేక మ‌రోసారి దాడికి తెగ‌బ‌డ‌తారా ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి.

#Donald Trump#Trump Iran War#US Iran Conflict#Iran News#America News#Pentagon#US Military
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి